వస్త్ర వ్యాపారం వెలవెల | - | Sakshi
Sakshi News home page

వస్త్ర వ్యాపారం వెలవెల

Dec 30 2025 8:46 AM | Updated on Dec 30 2025 8:46 AM

వస్త్

వస్త్ర వ్యాపారం వెలవెల

ఇలాంటి రోజులు ఎప్పుడూ చూడలేదు

ఖాళీగా దర్శనమిస్తున్న దుకాణాలు

గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్న వ్యాపారులు

తణుకు అర్బన్‌: పండుగ రోజుల్లో కూడా తణుకు మార్కెట్‌ వెలవెలబోతోంది. క్రిస్మస్‌ పండుగకు పూర్తిగా వ్యాపారం జరగకపోగా, సంక్రాంతి పండుగకు పదిహేను రోజులు మాత్రమే ఉన్నప్పటికీ మార్కెట్‌లో దుకాణాలన్నీ ఖాళీగా ఉండడం వ్యాపారులకు మింగుడుపడడంలేదు. ప్రజల దగ్గర డబ్బుల్లేవ్‌ అనే మాటలు ప్రతి వ్యాపారస్తుడి నోటి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి రోజులు గతంలో ఎన్నడూ చూడలేదని ఆందోఽళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ అంటే వస్త్ర వ్యాపారం ఎక్కువ. గతంలో నెలరోజుల ముందునుంచే దుకాణాలు కిక్కిరిసిపోయేవి. నేడు ఇంకా బోణీ కాని రోజులు నడుస్తున్నాయంటే వ్యాపారం ఏ రకంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా దుకాణాలు వ్యాపారం జరగక మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాపారులే చెబుతున్నారు. వ్యాపారాలు జరగకపోవడంతో దుకాణాలు ఖాళీ చేస్తున్న పరిస్థితుల్లో తణుకులో రాష్ట్రపతి రోడ్డు, వేల్పూరు రోడ్డుల్లో సైతం పదుల సంఖ్యలో దుకాణాలు ఖాళీ కావడంతో టూలెట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.

వస్త్ర వ్యాపారానికి తణుకు పేరు

వస్త్ర వ్యాపారానికి తణుకు పట్టణం పేరుగాంచింది. పట్టణ ప్రాంత వాసులతోపాటు చుట్టుపక్కల వంద గ్రామాల నుంచి సైతం ప్రజలు తణుకులో ఉన్న వస్త్ర దుకాణాలకు వచ్చి తమకు ఇష్టమైన వస్త్రాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నగరాల్లో పేరుగాంచిన భారీ వ్యాపార సంస్థలు సైతం తణుకులో ఏర్పాటుచేసిన షోరూంలు గతం నుంచి అందుబాటులో ఉన్నాయి. రెడీమేడ్‌ దుస్తులు సైతం బ్రాండెడ్‌ కంపెనీలు విక్రయించే పేరుగాంచిన షోరూంలు ఉన్నాయి.

రద్దీ లేని ప్రధాన వీధులు

సంక్రాంతి పండుగకు ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉన్నా అధికసంఖ్యలో వస్త్ర, ఫ్యాన్సీ దుకాణాలున్న వీధులు సైతం ఇంకా నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తణుకు నరేంద్ర సెంటర్‌ నుంచి వేల్పూరు రోడ్డు తణుకు పట్టణ వస్త్ర వ్యాపారానికి గుండెకాయ లాంటిది. అటువంటి ప్రధాన వీధికి ఇంకా పండుగ సందడి రాలేదు. బాబు ఎంపోరియం వీధి, ఆలమూరి వారి వీధుల్లో వస్త్ర దుకాణా లతోపాటు మగువలు మెచ్చే ఫ్యాన్సీ, గాజులు, ఎంబ్రాయిడరీ, లేడీస్‌ డ్రెస్‌ మెటీరియల్‌ వంటి దుకాణాలు సైతం ఖాళీగానే ఉండడం వ్యాపారులకు అర్థంకాని పరిస్థితి. రాష్ట్రపతి రోడ్డులోని చెప్పుల, గిఫ్ట్‌, బంగారు దుకాణాలు సైతం ఖాళీగా ఉన్నాయి. పండుగ వ్యాపారాన్ని నమ్ముకుని ఉన్న వ్యాపారులు కనీసం దుకాణాల్లో పనిచేసే వర్కర్లకు కూడా జీతాలివ్వలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు.

సంక్షేమ నిధులతో సుభిక్షంగా వ్యాపార రంగం

గత వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం రూపంలో అందచేసిన నగదు మార్కెట్‌లో చలామణి కావడంతో వ్యాపార రంగం విరాజిల్లిందని వ్యాపారులే చెబుతున్నారు. ప్రతి నెలా ఏదోక పథకం పేరుతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సొమ్ముతో కొనుగోళ్లు చేయడంతో మార్కెట్‌లో డబ్బు మారకం జరిగేది. నేటి ఇబ్బందులు చూస్తుంటే ఆర్థికమాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయా అనే సందేహం కలుగుతోంది.

మా 20 సంవత్సరాల వ్యాపార అనుభవంలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదు. మార్కెట్‌లో నగదు మారకం సమస్యతోపాటు ఆన్‌లైన్‌ వ్యాపారం, మాల్స్‌ కూడా ఒక మాదిరి వ్యాపారాలను కుంగదీస్తున్నాయి. క్రిస్మస్‌ పండుగలో సైతం వ్యాపారం జరగలేదు. సంక్రాంతి పండుగలోనైనా వ్యాపారం జరుగుతుందేమోనని చూస్తుంటే ఇప్పటి వరకు అదికూడా లేదు.

– జె.సుజాత, రెడీమేడ్‌ షాపు యజమాని

వస్త్ర వ్యాపారం వెలవెల1
1/2

వస్త్ర వ్యాపారం వెలవెల

వస్త్ర వ్యాపారం వెలవెల2
2/2

వస్త్ర వ్యాపారం వెలవెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement