విద్యా విధానం.. అస్తవ్యస్తం
న్యూస్‌రీల్
ప్రమాదాలకు గురైన స్కూల్ బస్సులు
వేతనాలు పెరగక వెతలు
ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వేతనాలు పెరగక.. ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8లో u
● ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యం
● తల్లికి వందనంలో భారీగా కోత
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
భీమవరం: జిల్లాలో గత ఏడాదిగా విద్యావిధానంగా అస్తవ్యస్థంగా మారింది. పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం, విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు విద్యార్థినిల పట్ల అసభ్య ప్రవర్తన, పాఠశాలల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువ కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మన బడి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్ధలకు దీటుగా తయారుచేసి సకల సౌకర్యాలు కల్పించారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు, ఎన్నికల అనంతరం నిలిచిపోయిన అనేక పనులకు మోక్షం లేకుండా పోయింది. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1,427 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్షకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
నలుగురు టీచర్ల సస్పెండ్ :
పాఠశాలలకు వచ్చే విద్యార్ధులను కన్నబిడ్డలుగా చూసి విద్యాబుద్ధులు నేర్పాల్సిన నలుగురు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో భయపడిన బాలికలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లాలోని పాలకొల్లు మండలం అగర్తిపాలెం, భీమవరం మండలం గొల్లవానితిప్ప, భీమవరం పట్టణంలోని రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గొల్లవానితిప్ప స్కూల్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు స్కూల్స్
ప్రైవేటు స్కూల్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో విద్యను వ్యాపారంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయించకూడదనే నిబంధనలు గాలికి వదిలి యథేచ్చగా అమ్ముకున్నారు. జిల్లాలోని తణుకు, భీమవరం తదితర పట్టణాల్లో ప్రైవేటు స్కూళ్లలో విక్రయాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని విద్యాశాఖాధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదు. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంకు అధిక మొత్తంలో వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
పది విద్యార్థులకు అందని పౌష్టికాహారం
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి గత ప్రభుత్వం విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి వారికి పౌష్టికాహారంగా ప్రత్యేకంగా స్నాక్స్ అందించేవారు. ప్రస్తుతం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు తప్ప ఎలాంటి స్నాక్స్ లేవు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులు తరగతిలో ఉండడం వల్ల నీరసించిపోతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలను నిర్లక్ష్యంగా నడపడంతో అనేక చోట్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో విద్యార్థులు గాయాల పాలయ్యార. భీమవరం పట్టణంలోని తిరుమల విద్యాసంస్ధల బస్సు డ్రెయిన్‌లోనికి ఒరిగి బోల్తా పడింది. వీరవాసరం మండలంలో లిటిల్ బడ్స్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టినా విద్యార్థులకు పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యా విధానం.. అస్తవ్యస్తం
విద్యా విధానం.. అస్తవ్యస్తం
విద్యా విధానం.. అస్తవ్యస్తం
విద్యా విధానం.. అస్తవ్యస్తం


