దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం

May 13 2025 12:39 AM | Updated on May 13 2025 12:39 AM

దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం

దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం

కాళ్ల: ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా దళితుల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించడం అన్యాయమని, వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి హెచ్చరించారు. సోమవారం కాళ్ల మండల కేంద్రంలో లంక రోడ్డులో ఉన్న దళితుల ఇళ్లను కేవీపీఎస్‌ బృందం పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కెవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కాళ్ల మండల కేంద్రం లంక రోడ్డులో ఉన్న పది దళిత కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా కరెంటు కట్‌ చేయడం అన్యాయమన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు చీకట్లో ఉంటూ కొవ్వొత్తుల వెలుగులో చదువుకుని పరీక్షలకు వెళ్లడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారమే దళితుల ఇళ్ళకు కరెంట్‌ కట్‌ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటించాల్సి వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతోనే కరెంట్‌ కట్‌ చేసినట్లు చెప్పారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలక్ట్రికల్‌ ఏఈ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క కరెంటు కట్‌ చేశారని తక్షణం వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులు కాబట్టే ఆధిపత్యాన్ని చూపించి అన్యాయంగా కరెంటు కట్‌ చేశారన్నారు. తక్షణం కరెంటు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయం చూపించే ఇళ్లు తొలగిస్తున్నామని చెపుతున్న ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తొలగించాలనుకుంటున్న ఇళ్ళకు వచ్చి బాధితులతో మాట్లాడాలన్నారు. కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో తొలగిస్తున్న పేదల ఇళ్ళకు ప్రత్యామ్నాయం చూపుతున్నారని ఎమ్మెల్యే చెపుతున్నారని ప్రత్యామ్నాయం అంటే ఇళ్ల స్థలాలు చూపి పట్టాలు చేతికివ్వడం మాత్రమే కాదని పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కూల్చిన ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇల్లు కట్టుకొనే వరకు అద్దె కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కేవిపీఎస్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్‌, సీఐటీయు జిల్లా నాయకుడు గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement