
ఎకై ్సజ్ ఏసీ తనిఖీలు
తణుకు అర్బన్: తణుకు ఎకై ్సజ్ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోను తక్షణమే చార్జ్‌షీట్స్ వేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.నాగ ప్రభుకుమార్ ఆదేశించారు. గురువారం తణుకు ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ తదితర కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తణుకు శివారులోని ఆంధ్రా డిస్టిలరీస్, వాన్‌బెర్రీ ప్రైవేట్ లిమిటెడ్‌లోని మిథనాల్, ఆర్‌ఎస్ యూనిట్‌లను పరిశీలించారు. రసాయనాల వాడకంలో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. పెండింగ్ కేసుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
ఐటీఐ ప్రవేశాలకు 24 వరకు గడువు
ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి ఈనెల 24న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వి.శ్రీనివాసరాజు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో వెరిఫికేషన్ చేయించుకుని రశీదు పొందాలని, వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులని తెలిపారు. వివరాలకు నేరుగా లేదా ఫోన్ 08816 297093, 9676099988 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఈసెట్‌లో ఆకివీడు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్
ఆకివీడు: జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహిం చిన ఏపీఈసెట్– 2025 పరీక్షలో బీఎస్సీ స్ట్రీమ్‌లో ఆకివీడు మండలం తరటావకు చెందిన కొట్టి గంగా భవానీ రాష్ట్రస్థాయిలో 95 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే దళిత కుటుంబానికి చెందిన కొట్టి కాశీ విశ్వనాథం, ధనలక్ష్మి దంపతుల కుమార్తె గంగాభవానీ మండలంలోని తరటావ, చినకాపవరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి వరకు చదివింది. ఇంటర్ హనుమాన్ జంక్షన్‌లోని జేఎన్‌జీ జూనియర్ బాలికల కాలేజీలో పూర్తిచేసి, డిగ్రీ ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ థెరిస్సా అటానమస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్, మ్యా థ్స్‌లో 93 శాతం మార్కులు సాధించింది. ఈసెట్ కోసం ఇంటి వద్ద నుంచి ప్రీపెర్ కాగా 95 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీటెక్ కంప్యూటర్స్ చదవాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నట్టు ఆమె తెలిపింది. తల్లిదండ్రులు ఇద్దరూ నిర్లక్ష్యరాస్యులు కాగా ఆమె సోదరుడు అంధుడు.
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ
భీమవరం: జిల్లాలో గురువారం ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 8,281 మందికి 7,925 మంది, ఒకేషనల్ కేటగిరీలో 594 మందికి 535 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ కేటగిరీలో 1,049 మందికి 963 మంది, ఒకేషనల్ కేటగిరీలో 192 మందికి 173 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 6,067 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ పరీక్షలకు 5,059 మందికి 4,830 మంది, ఒకేషనల్ పరీక్షలకు 390 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 650 మందికి 601 మంది, ఒకేషనల్ పరీక్షలకు 269 మందికి 246 మంది హాజరయ్యారు.
విద్యాహక్కుకు విఘాతం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా విద్యాశాఖాధికారుల తీరుతో 98 మంది పేద విద్యార్థుల విద్యాహక్కుకు విఘాతం కలిగించారని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఏలూ రు రూరల్ మండలంలోని కండ్రికగూడెం ఎంపీయూపీ పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భా గంగా 241 మంది విద్యార్థులుండగా ప్రాథమి క పాఠశాలలో 98 మంది విద్యార్థులున్నారని పేర్కొన్నారు. అయితే 98 మంది విద్యార్థులను కిలోమీటరుకు పైగా దూరమున్న మరో పాఠశాలకు తరలించడంతో వీరంతా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.

ఎకై ్సజ్ ఏసీ తనిఖీలు