
అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని..
డబ్బు కట్టి మోసపోయాం
విస్సాకోడేరు పంచాయతీ పరిధిలో శ్రీహరిపురం పేరిట వేసిన లేవుట్‌లో స్థలాలకు డబ్బు కట్టి మోసపోయామని విశ్రాంతి ఉద్యోగులు ఉ ద్యోగులు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చే శారు. రిజిస్ట్రేషన్ చేయకుండా, ప్లాట్లు అప్పగించకుండా ఏపీ స్టేట్ గర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తమను మోసం చేసిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అంబేడ్కర్ భవన సమస్య పరిష్కరించాలి
భీమవరం అంబేడ్కర్ భవన్ సమస్య పరిష్కరించాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. భవనం గురించి మాట్లాడుతున్న దళిత ఉద్యోగులు, దళితులపై సంబంధం లేని వ్యక్తులు దాడులకు దిగుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ
రాష్ట్ర కమిటీల్లో నియామకాలు
భీమవరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం సోమ వారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా ఒరిగేటి మనోజ్ (తణుకు), రాష్ట్ర దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడిగా కొల్లాటి నాగరాజు (నరసాపురం), రాష్ట్ర దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా బుంగా జయరాజు (పాలకొల్లు), రాష్ట్ర దివ్యాంగుల విభాగం సెక్రటరీగా కేసిరెడ్డి దిలీప్ (ఉండి) నియమితులయ్యారు.
చట్టపరిధిలో ఫిర్యాదులపై చర్యలు
భీమవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరిధిలో పరిష్కారిస్తామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరంలోని జిల్లా పోలీస్ కార్యాల యంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా 8 ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అహ్మదున్నీషా పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఈఏపీసెట్ పరీక్షలు
భీమవరం: భీమవరంలో ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 87 మంది, మధ్యాహ్నం 100 మందికి 97 మంది, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉద యం 90 మందికి 81 మంది, మధ్యాహ్నం 90 మందికి 85 మంది విద్యార్థులు హాజరయ్యా రు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 91 మందికి 78 మంది, మధ్యాహ్నం 90 మందికి 79 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 91 మందికి 81 మంది, మధ్యాహ్నం 90 మందికి 81 మంది హాజరయ్యారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఈఏపీసెట్ పరీక్షలకు ఉదయం 241 మందికి 219 మంది, మధ్యాహ్నం 239 మందికి 224 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ పర్యవేక్షించారు.
టెన్త్ సప్లిమెంటరీకి 54.75 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో సోమవారం జరిగిన పదో తర గతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు 54.75 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. తెలుగు పరీక్షకు 1,295 మందికి 709 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అలాగే ఇంటర్మీడియెట్ (ఏపీఓఎస్‌ఎస్) హిందీ పరీక్షకు 120 మందికి 27 మంది గైర్హాజరయ్యారన్నారు. 28 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడ మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.

అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ