
యలమంచిలిలో న్యాయం గెలిచింది
యలమంచిలి: యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో తె లుగుదేశం నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచి ఇనుకొండ ధనలక్ష్మి ఎంపీపీ అయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఎంపీపీ ఎన్నిక అనంరతం చించినాడలోని మునసబు బంగ్లాలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందన సభ నిర్వహించారు. ఎంపీపీ ధనలక్ష్మితోపాటు ఆ మెకు అండగా నిలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అంటే మూడు రంగుల జెండా, ఒకటే అజెండా ఉంటుందన్నారు. మూడు పార్టీలు కూటమిలా అధికారం కో సం అడ్డదారులు తొక్కడం తమ నాయకుడు జగన్ కు చేతకాదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకోవాలని తెలుగుదేశం నాయకులు చేసిన కుట్రలు భగ్నమయ్యాయంటే అది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుల నిజాయతీకి తార్కాణమన్నారు. కూటమి నాయకుల ప్రలోభాలకు గురికాకుండా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమికి చెంపపెట్టు : పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూసిన తెలుగుదేశం నాయకులకు ఈ ఎన్నికలు చెంపపెట్టు అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారం కోసం తెలుగుదేశం నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్, మాజీ కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు, వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, నాయకులు నిమ్మకాయల రామకృష్ణ, బోనం బులివెంకన్న, నడపన గోవిందరాజులునాయుడు, చివటపు నాగేశ్వరరావు, రావూరి బుజ్జి, వీరా ఉమాశంకర్, మేళం రామాంజనేయులు, మంద హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
యలమంచిలి: యలమంచిలి ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలో ఆమె ఒక్కరే ఎంపీపీ స్థానానికి నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎంపికై నట్లు డ్వామా పీడీ, ప్రిసైడింగ్ అధికారి కేసీహెచ్ అప్పారావు ప్రకటించారు. ఎన్నిక పూర్తయిన తరువాత ఆయన ధనలక్ష్మికి ఎన్నిక పత్రం అందజేశారు. అనంతరం ఆమె తో ప్రమాణస్వీకారం చేయించారు.
కోర్టు మొట్టికాయలతో ఎన్నిక నిర్వహణ..
మార్చి నెలలో కూటమి సభ్యులు, నాయకుల హై డ్రామాకు అధికారులు వత్తాసు పలకడంతో అప్పు డు ఎంపీపీ ఎన్నిక జరగకుండానే వాయిదా పడటంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు 12 మంది హైకోర్టును ఆశ్రయించారు. కోరం సభ్యులు వచ్చి నా ఎంపీపీ ఎన్నిక నిర్వహించకపోవడంపై జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆశ్చర్యంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతో మరలా ఇప్పుడు ఎన్నిక నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు