
ఇరగవరం ఉప సర్పంచ్ ఏకగ్రీవం
ఇరగవరం: ఇరగవరంలో సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి పట్టు నిలుపుకుంది. అధికార కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కోటిపల్లి వీర వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు డిప్యూటీ ఎంపీడీఓ, ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక అనంతరం ఉప సర్పంచ్ కోటిపల్లికి సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. తనకిచ్చిన అవకాశం బాధ్యతను పెంచిందని, గ్రామాభివృద్ధి కోసం కృషిచేస్తానని ఉప సర్పంచ్ కోటిపల్లి అన్నారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మూడేళ్లు ఒకరు, రెండేళ్లు మరొకరు ఉప సర్పంచ్ పదవిని పంచుకున్నారు.