
జగన్‌ను కలసిన యలమంచిలి ఎంపీపీ
యలమంచిలి: యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికలో విజయం సాధించిన ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఎన్నిక వివరాలను వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాస్, కొప్పాడి శ్రీనుబాబు, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్ బాబు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ నాయకులు చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, మాజీ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ కుక్కల బాలచంద్రన్, నిమ్మకాయల రామకృష్ణ ఉన్నారు.