
మంత్రిగారూ.. మెడికల్ కాలేజీ
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
సాక్షి, భీమవరం: వైద్య విద్యను పేద విదార్థులకు చేరువ చేసేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారు జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీఇక్కడ బురద తప్ప మెడికల్ కళాశాల పనులేమి జరగడం లేదుశ్రీ అంటూ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎంతో హడావుడి చేశారు. పనుల వేగం పెంచాలంటూ పార్టీ పెద్దలను సైతం తీసుకువచ్చి నిరసనలు తెలిపారు. కూటమి వచ్చాక ఆయన్ను మంత్రి పదవి వరించడంతో ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని అంతా ఆశించారు. ఇంతవరకూ ఆయన కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. పాలకొల్లు మండలం దగ్గులూరులోని సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కళాశాల నిర్మాణంతో జిల్లా వాసులకు మేలు జరుగుతుందని, ఎంతో మందికి ఉపాది లభిస్తుందని స్థానికులు ఆశించారు.
నిధుల లేక నిలిచిన పనులు
2023 ఆగస్టులో నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. ఇనన్‌పేషెంట్, అవుట్ పేషెంట్, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి రూ.75 కోట్ల విలువైన పునాది పనులు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల పనులకు బ్రేక్ వేసింది. ఈ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. సైట్‌లోని ఐరన్, ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని తరలించుకుపోతోంది. పనులు ఆగిపోవడంతో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లారు. కాలేజీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవనుంది.
న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో రూ.475 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు
60 ఎకరాల్లో పనులు ప్రారంభం.. రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తి
గతంలో పలుమార్లు సైట్ వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల
కూటమి వచ్చాక కన్నెత్తి చూడని వైనం
త్వరితగతిన పూర్తి చేయాలి
మెడికల్ కళాశాల ద్వారా పాలకొల్లు, పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. నిర్మాణ పనులు పూర్తయితే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంలో ఇప్పటి పాలకులు ఉన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– గుడాల శ్రీహరి గోపాలరావు,
వైఎస్‌ఆర్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి
పనులు ఆపడం సరికాదు
గత ప్రభుత్వం రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 15 మెడికల్ కళాశాలల పనులు చేపట్టి ఐదింటిని ప్రారంభించింది. కూటమి వచ్చాక పాలకొల్లులోని పనులను అర్ధాంతరంగా ఆపేయడం సరికాదు. గత ప్రభుత్వంలో కళాశాల పనుల కోసం తపించిపోయిన నిమ్మల మంత్రి అయ్యాక ఒక్కసారి సందర్శించలేదు.
– ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

మంత్రిగారూ.. మెడికల్ కాలేజీ