
కూటమి నిస్సిగ్గు రాజకీయం
మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ ప్రలోభాలకు అధికార పార్టీ తెరలేపింది. ప్రలోభాలకు లొంగకపోవడంతో వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలపై దాడులు చేయిస్తామని బెదిరించింది. దానికి భయపడకపోవడంతో అక్రమ కేసులు బనాయించింది. అయినా య లమంచిలి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలంతా మంత్రి నిమ్మల రామానాయుడు చర్యలను సమర్థంగా తట్టుకుని నిలబడటంతో సోమవారం మంత్రి నిమ్మల చేతులెత్తేశారు. పర్యవసానంగా యలమంచిలి ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించింది. జిల్లాలో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ బలం లేకపోయినా అడ్డగోలుగా ఎన్నికల్లో పోటీ చేసి బెదిరింపు, దౌర్జన్యాలతో అత్తిలి ఎంపీపీ, కై కలూరు వైస్ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. తద్వారా జిల్లాలో నిస్సిగ్గు రాజకీయాలకు టీడీపీ యథేచ్ఛగా కొనసాగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
యలమంచిలిలో నిబద్ధతకు పట్టం కట్టి..
యలమంచిలి, అత్తిలి ఎంపీపీ స్థానాలకు, కై కలూరు వైస్ ఎంపీపీ స్థానాలకు ప్రత్యేకాధికారులు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. యలమంచిలిలో 18 మంది ఎంపీటీసీలకుగాను ఒక స్థానం ఖాళీ కావడంతో 17 మంది సభ్యులుండగా దానిలో 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు కాగా మిగిలిన ముగ్గురు టీడీపీ, ఒకరు జనసేన. 13 మంది సభ్యుల్లో ఒకరు జనసేనలో చేరడంతో 12 మంది సభ్యులు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. ఈ క్రమంలో గత మార్చి 27న ఎన్నిక జరగాల్సి ఉండగా టీడీపీ మంత్రి నిమ్మల డైరెక్షన్‌లో చిల్లర రాజకీయాలు చేసి 28కి వాయిదాపడేలా చేసింది. 28న కూడా హైడ్రామా నడిపి ఎన్నిక వాయిదా వేయించారు. ఈ క్రమంలో ఎన్నిక నిరవధికంగా వాయిదా ప్రకటించిన క్రమంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఎన్నికల అధికారులకు మొట్టికాయలు వేసింది. దీంతో అధికారులు మరలా ఎన్నిక నిర్వహించారు. మంత్రి రామానాయుడు వైఎస్సార్‌సీపీ జెండా ఎగురకూడదనే కక్షతో సభ్యులను రకరకాలుగా భయభ్రాంతులకు గురిచేయడం, పార్టీ నేతలపై కక్షపూరితంగా కేసులు బనాయించి నానాయాగీ చేసినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధైర్యంగా ముందడుగు వేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్నికకు హాజరుకావడంతో కూటమి ముఖం చాటేసింది. ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు అధికారులు ప్రకటించి డిక్లరేషన్ అందజేశారు.
ఆరిమిల్లి అంబులెన్స్ రాజకీయం
న్యూస్‌రీల్
కై కలూరులో టీడీపీకే కామినేని మద్దతు
కై కలూరులో భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కామినేని శ్రీనివాస్ స్థానికంగా ఆ పార్టీ నేతలకు పదవులు దక్కకుండా బలంగా చక్రం తిప్పుతున్నారు. సాధారణ నామినేట్ పదవులు మొదలు అన్నింటిలోనూ టీడీపీ సభ్యులు మినహా సొంత పార్టీకి ప్రాధాన్యం లేదు. ఇదే క్రమంలో కై కలూరు వైస్ ఎంపీపీ–1 స్థానాన్ని టీడీపీకి కట్టపెట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు పార్టీ విప్ జారీ చేసింది. అయినా ఎమ్మెల్యే ఒత్తిళ్లతో పార్టీ మారిన సభ్యులు విప్ ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారు. కై కలూరులో మొత్తం 22 స్థానాలకు 21 స్థానాలు వైఎస్సార్‌సీపీ, ఒకటి టీడీపీ గతంలో గెలుచుకుంది.
ప్రజాస్వామ్యం అపహాస్యం
ఎంపీపీ ఎన్నికల్లో అక్రమ కేసులు, తీవ్రస్థాయిలో బెదిరింపులు
ఒత్తిళ్లను తట్టుకుని యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కై వసం
అత్తిలిలో ఓటింగ్‌కు అంబులెన్స్‌లో ఫిరాయింపు ఎంపీటీసీలు
ఎమ్మెల్యే ఆరిమిల్లి చిల్లర వ్యవహారాలపై సర్వత్రా చర్చ
యలమంచిలిలో చేతులెత్తేసిన మంత్రి నిమ్మల
కై కలూరులో బీజేపీ కాకుండా టీడీపీకి కామినేని పట్టం
ఉమ్మడి జిల్లాలో ముగిసిన ఉప పోరు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తనదైన శైలిలో చిల్లర రాజకీయాలకు తెరతీశారు. అత్తిలి మండలంలో 20 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 16 మంది వైఎస్సార్‌సీపీ, రెండు టీడీపీ, రెండు జనసేన గెలుపొందారు. ఒక వైఎస్సార్‌సీపీ సభ్యుడు గల్ఫ్‌లో ఉండటంతో మొత్తం 19 మంది ప్రస్తుతం ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత మార్చిలో అత్తిలి ఎంపీటీసీలతో మాజీ మంత్రి కారుమూరి తన నివాసం నుంచి ఓటింగ్‌కు వెళ్తున్న క్రమంలో దాదాపు వెయ్యి మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కారుమూరి ఇంటిని చుట్టుముట్టి దౌర్జన్యం చేసి దాడికి యత్నించి ఎంపీటీసీలు ఓటింగ్‌కు వెళ్లనీయకుండా నిలువరించారు. ఇదంతా పోలీసుల కళ్లెదుట జరిగినా స్పందించని పరిస్థితి. ఆ మరుసటి రోజు కూడా ఓటింగ్‌కు వెళ్లనీయకుండా ఎంపీటీసీలను ఒక రకంగా ఇంట్లోంచి బయటకు రాకుండా ఆందోళనకర వా తావరణం సృష్టించారు. నిరవధిక వాయిదా పడి సోమవారం ఎన్నిక జరుగుతుందని అధికారులు ప్రకటించిన క్రమంలో మూడు రోజుల ముందే వైఎస్సార్‌సీపీ సభ్యులు కొందరిపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఒక ఎంపీటీసీ దుబాయిలో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఇంటికి పోలీసులను పంపి బెదిరించి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం, మరో ఎంపీటీసీ ఇల్లు రోడ్డుపై ఉందని ఆక్రమణ కింద ఇంటిని కూల్చేస్తామని బెదిరించడం, మరికొందరు ఎంపీటీసీల వ్యాపారాలపై దాడులు చేయిస్తామని బెదిరించడం ఇలా తీవ్రస్థాయిలో భయపెట్టి అత్తిలి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకునేలా వ్యవహరించారు. కట్ చేస్తే.. టీడీపీ నుంచి ఎంపీపీగా గెలుపొందిన మక్కా సూర్యనారాయణ మూడేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీపీగా గెలుపొందిన వ్యక్తే కావడం గమనార్హం. పర్యవసానంగా టీడీపీలో మొదటి నుంచి ఉన్న ఎంపీటీసీలకు ఆరిమిల్లి హ్యాండ్ ఇచ్చారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఓటింగ్ వద్ద అడ్డుకుని ఆందోళన నిర్వహిస్తారనే భయంతో ఆరిమిల్లి ఎంపీటీసీలందరినీ అంబులెన్స్‌లో ఎన్నికకు తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కూటమి నిస్సిగ్గు రాజకీయం