
మానసిక దివ్యాంగుల సంరక్షణకు చర్యలు
భీమవరం(ప్రకాశంచౌక్): తల్లిదండ్రులు లేని మానసిక, బహుళ వైకల్యాలు గల బిడ్డల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ట్రస్ట్ యాక్ట్ పై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానసిక, బహుళ వైకల్యాలు ఉన్న పిల్లల పెంపకం, ఆహారం తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఏడుగురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కోటి రూ.38 వేల విలువైన ల్యాప్‌టాప్‌లను అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్‌కుమార్, కమిటీ సభ్యులు అంజలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిటేషన్ ప్రతినిధి ప్రసాద్, దివ్యాంగ మహా సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎస్‌ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వడగాల్పులపై అప్రమత్తం
జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా వడగాల్పును తట్టుకునేందుకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. ఈనెల 17న ‘బీట్ ద ఈట్’ థీమ్‌తో కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు.