
సారారహిత జిల్లాగా పశ్చిమ
భీమవరం: పశ్చిమగోదావరి సారారహిత జిల్లాగా ప్రకటించుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సారా తయారీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రుణాలు అందిస్తున్నామన్నారు. ఇలా జిల్లాలో గుర్తించిన 13 మందికి రూ.లక్ష చొప్పున రూ.13 లక్షల చెక్కును అందించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో సారా వృత్తిలో ఉన్న వారిని గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆర్‌ఎస్ కుమరేశ్వరన్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభుకుమార్ పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై..
మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ఎన్ కార్డ్ (జిల్లాస్థాయి కమిటీ ఫర్ బెటర్ కో–ఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి–ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ)పై సమావేశాన్ని నిర్వహించారు. డ్రగ్స్ అనర్థాలపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.