
ప్రశాంతంగా ఈఏపీసెట్
భీమవరం: భీమవరంలోని ఐదు కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్‌లో ఉదయం 170 మందికి 166 మంది, మధ్యాహ్నం 170 మందికి 164 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్‌లో ఉదయం 107 మందికి 104 మంది, మధ్యాహ్నం 107 మందికి 104 మంది హాజరయ్యారు. విష్ణు ఉమెన్స్ కళాశాలలో ఉదయం 86 మందికి 85 మంది, మధ్యాహ్నం 87 మందికి 86 మంది హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 101 మందికి 101 మంది, మధ్యాహ్నం 101 మందికి 99 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 93 మంది, మధ్యాహ్నం 100 మందికి 95 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం: వాసవీ ఇంజనీరింగ్ కళాశా లలో ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు 449 మందికి 435 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రత్నాకరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
టెన్త్ సప్లిమెంటరీకి 71 శాతం హాజరు
భీమవరం: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు శుక్రవారం 71 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 3,037 మంది విద్యార్థులకు 876 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఎస్‌ఎస్‌సీ (ఏపీఓఎస్‌ఎస్) పరీక్షకు 299 మందికి 219 మంది, ఇంటర్ (ఏపీఓఎస్‌ఎస్) పరీక్షకు 376 మందికి 324 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమో దు కాలేదని డీఈఓ చెప్పారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలి
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నారని, జీతాలు పెంచాలంటూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు పురపాలక సంఘ వాటర్ సప్లయ్ వర్కర్స్ వినతిపత్రం అందజేశారు. ఔట్ సోర్సింగ్ లో పదేళ్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలన్నారు. నాన్ పీ హెచ్ (వాటర్ సప్లయ్ వర్కర్స్)కు వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. హెచ్‌ఆర్ పాలసీ కల్పించాలని, ఔట్ సోర్సింగ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఔట్ సో ర్సింగ్‌లో సుమారు 3 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం వేకువ జామున పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు మూడు దుక్కుల వర్షం కురిసిందని, ఇటీవల కాలంలో ఇంత భారీ వర్షం కురియలేదని స్థానికులు తెలిపారు. తాడేపల్లిగూడెంలో 19.8 మి.మీ, పెంటపాడులో 28.2 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
కోవిడ్‌పై అప్రమత్తం
దెందులూరు: కోవిడ్ బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని దెందులూరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్‌కుమార్ అన్నారు. శుక్రవారం దెందులూరులో ఆయన మాట్లాడుతూ కోవిడ్ నివారణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. ప్రార్థనా, సామా జిక సమావేశాలు, పార్టీలు వంటివి వాయిదా వేసుకోవాలని, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమా నాశ్రయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, చలి జ్వరం, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు.

ప్రశాంతంగా ఈఏపీసెట్

ప్రశాంతంగా ఈఏపీసెట్