రేషనలైజేషన్‌లో లోపాలతో గందరగోళం
భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ గ్రామాల రేషనలైజేషన్‌లో లోపాలు ఉన్నాయని, దీంతో గందర గోళ పరిస్థితి నెలకొందని గ్రామ రెవెన్యూ అధికా రుల (వీఆర్వోల) సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డికి వీఆర్వోల తో కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రకు మద్దతు తెలిపా రు. అనంతరం రవీంద్రరాజు మీడియాతో మాట్లాడుతూ వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. అయితే రెండు, మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తే వీఆర్వోలపై పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. క్లస్టర్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,500 మంది వీఆర్వోలు, 4,722 మంది విలేజ్ సర్వేయర్లను తగ్గిస్తూ ఏ సచివాలయానికి కేటాయించారో చెప్పలేదన్నారు. ప్రభుత్వం భూ హక్కు సర్వేను 100 రోజు లు లేదా 60 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో రెండు మూడు గ్రామాలకు ఒక వీఆర్వో ఉంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పటికే రేషనలైజేషన్ ప్రక్రియలో లోపాలను రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీ నారాయణ, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గుమ్మల జక్రయ్య, నాయకులు పాల్గొన్నారు.


