వివాదాలకు కేంద్రంగా తణుకు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రశాంతతకు మారుపేరుగా నిలి చే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్ర భుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో..
తణుకు నియోజకవర్గంలోని అత్తిలి ఎంపీపీ ఎన్నికల్లో సైతం మెజార్టీ వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నా ఎ న్నికల కేంద్రానికి ఎంపీటీసీలను చేరకుండా ఏకంగా మాజీ మంత్రి కారుమూరి నివాసంపై కూటమి శ్రేణులు దౌర్యన్యానికి దిగిన తీరు, పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం వంటి వ్యవహారం కూడా రాష్ట్రంలో వైరల్‌గా మారాయి.
తేతలిలలో పశు ఘోష
తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో పశువధ కర్మాగారం నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తుందని స్థానిక మహిళలు రోడ్డెక్కినా చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడం, తాజాగా విశాఖలో పట్టుబడిన గోమాసం తణుకుకు సంబంధించినదేనని కేంద్ర నిఘా విభాగం ఈ ప్రాంత పశు వైద్యాధికారిని విశాఖ పిలిపించడం వంటి ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా తణుకు గోవధ ప్రాంతంగా ఖ్యాతి సాధించిందంటూ ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
యథేచ్ఛగా పేకాట.. గంజాయి
పేకాట, గంజాయి, మద్యం మత్తులో దాడులు, మ ర్డర్‌లు వంటి ఘటనలు తణుకు ప్రాంతానికి మా యని మచ్చలు మారాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత తణుకు సంతలో మైనర్లు బహిరంగంగా మద్యం విక్రయించిన వ్యవహారం జరగ్గా ఇది వైరల్‌గా మారింది. అలాగే తణుకు అన్న క్యాంటీన్‌లో కడిగిన నీటిలోనే ప్లేట్లు కడిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అధికారులు సతమతం
తణుకులో ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితులతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నారు. ము ఖ్యంగా పోలీసు శాఖలో అధికారుల నుంచి సిబ్బంది వరకు ఒత్తిళ్లతో తలపట్టుకునే పరిస్థితులు వ చ్చాయని వాపోతున్నారు.
కూటమి కవ్వింపు చర్యలు
ప్రశాంతతకు మాయని మచ్చ
వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీతో రగడ
దాడులు, దౌర్జన్యాలు, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు


