శిక్షణతో జీవనోపాధి
‘పోలవరం’ లేకుండానే కొత్త జిల్లా
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. 8లో u
నరసాపురం రూరల్: యువత, మహిళల జీవనోపాధికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం మండలంలోని పెదమైనవానిలంకలో ఆమె పర్యటించారు. డిజిటల్ భవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఫ్యూచర్ స్కిల్స్ హబ్‌ను ఆమె ప్రారంభించారు. తమ ఫౌండేషన్ 120కి పైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేసి 35,000 మందికి పైగా విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యతతో చేరువైందని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీకారం చుట్టారు. సముద్ర కోతకు గురికాకండా చే పట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. 146 మందికి పీఎం ఆవాస్ యో జన కింద ఏడాదిలోపు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. మత్స్యకారులకు బోట్లు, వలల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వర గా మంజూరు చేయాలన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు ప య్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు మా ట్లాడారు. సభలోఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.


