కొత్త సంస్కృతి
తణుకులో కొత్త సంస్కృతికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రశాంతంగా ఉండే తణుకులో వివాదాలు సృష్టించి గొడవలు పెట్టేందుకు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటుచేసి తణుకులో కవ్వింపు చర్యలకు టీడీపీ నేతలు తెరదీశారు. మేమెప్పుడూ టీడీపీ పార్టీ పెద్దలకు కూ డా గౌరవాన్ని ఇచ్చే రకంగానే నడుచుకున్నాం. అంతేకాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తీసుకున్న నిర్ణయాలను పలు సందర్భాల్లో ఇప్పటికీ స్వాగతిస్తూనే ఉన్నాం. సుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని పార్కుగా తీర్చిదిద్దాం. అలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించామే కానీ ఎప్పుడూ గీత దాటి చెత్త రాజకీయాలు చేయలేదు. అయితే నేడు గొ డవ లు సృష్టించి పోలీసులను పావులుగా వాడుకుంటున్న దుస్థితి నెలకొంది.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి


