ఎట్టకేలకు లైన్‌ కట్టారు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు లైన్‌ కట్టారు

Dec 29 2025 12:00 PM | Updated on Dec 29 2025 12:00 PM

ఎట్టకేలకు లైన్‌ కట్టారు

ఎట్టకేలకు లైన్‌ కట్టారు

ఎట్టకేలకు లైన్‌ కట్టారు కొడుకుపై తండ్రి కత్తితో దాడి నేడు పీజీఆర్‌ఎస్‌ రెవెన్యూ క్లినిక్‌ల ఏర్పాటు వైఎస్సార్‌ విగ్రహ ప్రాంతంలో 144 సెక్షన్‌ కొనసాగిన అధ్యాపకుల నిరసన

ఆకివీడు: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నుంచి మూలలంక బోదె వరకు డ్రెయిన్‌ నిర్మాణానికి ఎట్టకేలకు లైన్‌ కట్టి నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించి ట్రాన్స్‌ఫార్మర్లు, రిలయన్స్‌ మార్ట్‌ వద్ద వంకర్లు లేకుండా లైన్‌ లాగి ముగ్గువేసి పనులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా జాతీయ రహదారికి చేర్చి ఉన్న వ్యాపార సంస్థలు, ఇళ్ల దారుల వద్ద నుంచి కొంత సొమ్ము సేకరించి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పీపీపీ పద్ధతిపై జరుగుతుండటం, నాణ్యతలేమిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. పక్కాగా డ్రెయి నేజీ నిర్మించాలని కోరుతున్నారు.

యలమంచిలి: కుమారుడిపై కన్నతండ్రి కత్తితో దాడి చేసిన సంఘటన మండలంలోని కొంతేరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కొంతేరులో సిర్రా సుబ్బారావుకు రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. ఒక పోర్షన్‌లో సుబ్బారావు, మరో పోర్షన్‌లో కుమారుడు మధు ఉంటున్నారు. కొన్నాళ్లుగా కుమారుడిని ఇల్లు ఖాళీ చేయమని తండ్రి చెబుతున్నా ఖాళీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సుబ్బారావు బండ కత్తితో మధుపై దాడి చేశాడు. మధు తలపై మోదడంతో గాయమైంది. మధును పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యలమంచిలి హెడ్‌ కానిస్టేబుల్‌ వై.మనోహర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం(ప్రకాశంచౌక్‌): జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చని సూచించారు.

భీమవరం(ప్రకాశంచౌక్‌): రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి రె వెన్యూ క్లినిక్‌లు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిందని, దీని ద్వారా జిల్లాలో రెవెన్యూ సమస్యలు వేగవంతమైన పరిష్కారానికి కృషి చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌కు సమాంతరంగం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీ పరిశీలించిన వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారితో మా ట్లాడి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. పట్టాదారు పాస్‌ బుక్‌లు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌, రెగ్యులేషన్‌ ఆఫ్‌ 1/70, రీ సర్వే, అడంగల్‌, వెబ్‌ల్యాండ్‌, ఎఫ్‌లైన్‌ పిటిషన్‌ తదితర అంశాలపై సమస్యలపై అర్జీలను సమర్పించవచ్చన్నారు.

తణుకు అర్బన్‌: వైఎస్సార్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు చంద్రబాబు ఫ్లెక్సీ ఏర్పాటుచేసి వి వాదాస్పదం చేసిన ప్రాంతంలో తణుకు రూ రల్‌ పోలీసులు 144 సెక్షన్‌ విధించినట్టు ప్రకటించారు. తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటుచేశామని, ప్రజలు గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు, ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం నిషేధమంటూ ఆదివారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అలాగే ఆటోలో మైక్‌ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

నూజివీడు: తమకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నాలుగో రోజైన ఆదివారం నిరసన కొనసాగించారు. పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డి మాండ్లపై ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు స త్వరమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఏ డేళ్లుగా తాము ఒకే జీతంతో పనిచేస్తున్నామని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా తమ వేతనాలను మాత్రం పెంచలేదని వాపోయారు. పలువురు మెంటార్ల వీరికి సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement