సంక్షేమం.. దూరం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం.. దూరం

Dec 29 2025 12:00 PM | Updated on Dec 29 2025 12:00 PM

సంక్ష

సంక్షేమం.. దూరం

ఆట అదరగొట్టారు ఆడబిడ్డ నిధి.. ఊసేది? పేదలకు కలగని గృహయోగం ఏడి‘పింఛెన్‌’ నిరుద్యోగ భృతి.. భ్రాంతి కార్పొరేషన్‌ రుణాలకు దారేది?

న్యూస్‌రీల్‌

ఆట అదరగొట్టారు
2025 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులకు కొత్త అనుభూతినిచ్చింది. పలు విభాగాల్లో క్రీడాకారులు పతకాలు సాధించారు. 8లో u

సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

భీమవరం (ప్రకాశంచౌక్‌): 2025.. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి సంకెళ్లు పడ్డాయి. సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయకుండా ఏడాదంతా గడిపేసింది. కూటమి మేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌లో భాగంగా చెప్పిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పెన్షన్‌ తదితర పథకాల ఊసెత్తలేదు. సంక్షేమం అందక పేద, మధ్యతరగతి మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళా సాధికారత, సంక్షేమం దిశగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందించిన సాయంతో చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించిన పలువురు మహిళలు ఈ ఏడాది వ్యాపారాలు నడపలేక నిలిపివేశారు. ప్రకటనలు, బ్యానర్లతో ప్రభు త్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేద ని జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు.

సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా 18 ఏళ్ల నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ 2025లోనూ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పి 18 నెలలు గడిచినా అమలు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసింది. జిల్లాలో సుమారు 7 లక్షల మంది అర్హులు ఉన్నారు.

జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాదిలో ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. అలాగే ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి బిల్లు బకాయిలు ఉండటంతో పలువురు నిర్మాణాలు నిలిపివేశారు. జిల్లాలోని 20 మండలాల్లో 409 గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామంలో 10 నుంచి 100 కుటుంబాల వరకూ ఇళ్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.

పేద, మధ్యతరగతి వర్గాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ ఏడాది ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. ఈ ఏడాదిలో కొత్త పింఛన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. కొత్త పెన్షన్ల మంజూరు చేయకుండా సదరం పరిశీలన పేరిట పలువురు దివ్యాంగులకు పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో వీరు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగిన సంఘటనలు ఉన్నాయి.

సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి ఈ ఏడాదీ అమలు కాలేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున భృతి ఇస్తామన్న హామీని కూటమి సర్కారు ఈ ఏడాదీ నెరవేర్చలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. జిల్లాలో సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు.

ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం బీసీ, కాపు కార్పొ రేషన్ల ద్వారా సబ్సిడీపై రుణాలిస్తామని దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఒక్కరికీ కూడా రుణాలు మంజూరు చేయలేదు. మహిళలు, నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేయాలని భావించారు. వీరి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. జిల్లాలో దాదాపు 4 లక్షల మందిపైగా కార్పొషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు.

మహిళా సాధికారత కరువు

అమలుకాని ఆడబిడ్డ నిధి

రుణాలివ్వక వ్యాపారాలు ఢీలా

నిరుద్యోగ భృతి ఊసేలేదు

కొత్త ఇళ్లు, పింఛన్ల మంజూరు లేదు

2025లో సంక్షోభంలో సంక్షేమం

సంక్షేమం.. దూరం 1
1/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 2
2/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 3
3/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 4
4/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 5
5/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 6
6/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 7
7/8

సంక్షేమం.. దూరం

సంక్షేమం.. దూరం 8
8/8

సంక్షేమం.. దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement