బైక్‌పై ఫొటోలుంటే దాడి చేసేస్తారా..?
దెందులూరు: బైక్‌పై మా ఫొటోలు ఉంటే దాడి చేసేస్తారా.. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని దెందులూరు మా జీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదపాడు మండలం ఏపూరు సర్పంచ్ రామకృష్ణ తన బైక్ నంబర్ ప్లేట్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్, కొఠారు ఫొటోలు పెట్టుకోవడంతో రామకృష్ణపై టీడీపీ నేతలు చేసిన దాడిన ఖండించారు. దాడులు, దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టి వేధించడం మంచి సంప్రదాయం కాదన్నారు. ప్రజలతో ఎన్నుకున్న సర్పంచ్‌కి పట్టపగలే గ్రామంలో రక్షణ లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఇంక ఎవరికి రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలను తానెప్పుడూ చూడలేదన్నారు. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణు లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులను వేధి స్తున్నారని మండిపడ్డారు. బాధిత సర్పంచ్ రామకృష్ణని అబ్బయ్యచౌదరి ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీతోపాటు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామకృష్ణపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీకి వివరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. రామకృష్ణ కేసును దగ్గరుండి పర్యవేక్షించాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సభ్యులకు సూచించారు.
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఆగ్రహం


