
రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి
బుట్టాయగూడెం : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పొగాకు వ్యాపారి మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెంకు చెందిన ముప్పిడి వరప్రసాద్, గోపాలపురానికి చెందిన పి. కృష్ణ, గుంటూరుకు చెందిన ఏ.రాంబాబు, మెదడుమెట్లకు చెందిన టి.వీరాంజనేయులు అనేజంగారెడ్డిగూడెం నుంచి జీలుగుమిల్లి పొగాకు బేళ్లు కొనేందుకు వెళ్తుండగా లక్ష్మీపురం సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి తుప్పల్లోకి దూసుకుపోయింది. గాయపడిన క్షతగాత్రులను 108లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముప్పిడి వరప్రసాద్ అప్పటికే మృతి చెందాడు. పదేళ్లుగా మృతుడు వరప్రసాద్ పొగాకు వ్యాపారం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి