విద్యుత్‌ రాయితీ అందేనా..! | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ రాయితీ అందేనా..!

May 18 2025 12:47 AM | Updated on May 18 2025 1:11 AM

విద్య

విద్యుత్‌ రాయితీ అందేనా..!

ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025

సాక్షి, భీమవరం: ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఆక్వా సమస్యల పరిష్కారం కోసం సాగు సమ్మెకు సిద్ధమైన ఆక్వా రైతులు ఈ హామీని అమలు చేయాలని కోరుతున్నారు. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో 1.26 లక్షల ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. కోస్తా ఆక్వా కల్చర్‌ అథారిటీ (సీఏఏ) మార్గదర్శకాల మేరకు ఆక్వా జోన్‌లోని రైతులకు మాత్రమే ప్రభుత్వ లబ్ధి చేకూరుతోంది. గతంలో కొద్ది విస్తీర్ణం మాత్రమే జోన్‌ పరిధిలో ఉండడటంతో చాలా మంది రైతులకు లబ్ధి అందేదికాదు. గత ప్రభుత్వంలో ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో చాలా మంది రైతులకు లబ్ధి చేకూరింది.

కూటమి రైతుల్లోనూ అసంతృప్తి

విద్యుత్‌ సబ్సిడీ మంజూరులో జాప్యంపై కూటమికి చెందిన నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ, ఆక్వా రైతు సంఘం నేత మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎన్నికల వాగ్దానాన్ని త్వరితగతిన అమలుచేయాలని, అవసరమైతే ఈ అంశాన్ని తమ పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆక్వా రంగాన్ని సిండికేట్‌ దోపిడీ నుంచి కాపాడాలని, మేత ధరలు తగ్గించి, రొయ్య రేట్లు పెంచాలని కోరుతూ పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో పంట విరామానికి పిలుపునిచ్చిన జై భారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అందరికీ రాయితీ విద్యుత్‌ను అమలుచేయాలని కోరుతోంది.

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యం

ఆక్వా రంగానికి పెద్దపీట వేసిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ–ఫిష్‌ సర్వే ద్వారా 10 ఎకరాలలోపు రైతులకు చెందిన చెరువులను ఆక్వా జోన్‌ పరిధిలోకి తెచ్చింది. దీంతో జిల్లాలో ఆక్వా జోన్‌ పరిధిలోని చెరువులు 1,16,257 ఎకరాలకు పెరిగాయి. జోన్‌లోని 13,648 విద్యుత్‌ కనెక్షన్లను క్రమబద్ధీకరించి సబ్సిడీపై రూ.1.50లకే విద్యుత్‌ను అమల్లోకి తెచ్చింది. ఆక్వాకు అనుబంధ హేచరీలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు తదితర వాటికి నిరంతర విద్యుత్‌ సరఫరా, కనెక్షన్ల మంజూరు సులభతరం చేసింది. అప్సడా ఏర్పాటుచేసి హేచరీలు, ఫీడ్‌, ప్రొసెసింగ్‌ కంపెనీల ఆగడాలకు చెక్‌ పెట్టింది. సిండికేట్‌ మాయాజాలంతో రొయ్య ధరలను పూటకోరకంగా మారుస్తూ రైతుల కష్టాన్ని దోచుకునే పరిస్థితికి అడ్డుకట్ట వేసింది. 10 రోజుల పాటు ధరలు స్థిరంగా ఉండేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది.

జిల్లా రైతులపై రూ.2 కోట్ల భారం

జోన్‌తో నిమిత్తం లేకుండా అర్హత కలిగిన ఆక్వా రైతులందరికీ రూ.1.50 రాయితీ విద్యుత్‌ను అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లాలోని నాన్‌ ఆక్వా జోన్‌ చెరువులు సుమారు 9,000 ఎకరాల వరకు ఉండగా, వీటిలో 450 వరకు విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఎకరా చెరువులో ఆక్సి జన్‌ సరఫరా నిమిత్తం రెండు ఏరియేటర్లను తిప్పితే నెలకు సుమారు రూ.4,500 వరకు బిల్లు వస్తుంది. జోన్‌ పరిధిలోని రైతులు ఈ మొత్తంలో రూ.2,250లు చెల్లిస్తే, నాన్‌ జోన్‌ పరిధిలోని వారు మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుంది. 5 నుంచి 10 ఎకరాల వరకు సాగు చేసే రైతులపై ఈ భారం అధికంగా ఉంది. నాన్‌ ఆక్వాజోన్‌ పరిధిలో రైతులపై నెలకు రూ.2 కోట్లకు పైగా అదనపు భారం పడుతోందని అంచ నా. కూటమి పాలనలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రాయితీ విద్యుత్‌ రాకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. త్వరితగతిన హామీ అమలుకు ప్ర భుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అందరికీ ఇవ్వాలి

ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రొయ్యలు, చేపల రైతులకు విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50కు ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. దీంతో చాలా మంది రైతులు నష్టాల బారిన పడుతు న్నారు. రొయ్యలకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రతి ఒక్క రొయ్య, చేప రైతు లకు రూ.1.50కు విద్యుత్‌ సరఫరా చేయాలి.

– చవ్వాకుల సత్యనారాయణమూర్తి,

ఆక్వా రైతు, తోలేరు

ఊసే ఎత్తని కూటమి

నాన్‌ ఆక్వాజోన్‌కు సబ్సిడీ ఇస్తామన్న కూటమి నేతలు

ఏడాది కావస్తున్నా కార్యరూపం దాల్చని హామీ

జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు

నాన్‌ ఆక్వాజోన్‌లో సుమారు 9 వేల ఎకరాలు

రాయితీ కోసం రైతుల ఎదురుచూపులు

గత ప్రభుత్వంలో ఆక్వారంగానికి పెద్దపీట

విద్యుత్‌ రాయితీ అందేనా..! 1
1/2

విద్యుత్‌ రాయితీ అందేనా..!

విద్యుత్‌ రాయితీ అందేనా..! 2
2/2

విద్యుత్‌ రాయితీ అందేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement