కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

Dec 31 2025 8:34 AM | Updated on Dec 31 2025 8:34 AM

కీచక

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చెరుకువాడ బాలిక భక్తులతో పోటెత్తిన మద్ది ఓవరాల్‌ చాంపియన్‌గా సర్‌ సీఆర్‌ రెడ్డి పాలిటెక్నిక్‌

పెనుగొండ, పాలకొల్లు (సెంట్రల్‌), భీమవరం : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పోడూరులోని మండల ప్రజా పరిషత్‌ మెయిన్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావు నాలుగు రోజులు క్రితం అదే పాఠశాలలో 4, 5వ తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను పాఠశాల భవనంపైకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ చిన్నారులు భయంతో కేకలు వేసుకుంటూ కిందకు వచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం రాత్రి ఓ విద్యార్థిని తల్లి పోడూరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఉపాధ్యాయుడు ఎం నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇవీవీఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ బీఎల్‌ నారాయణ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

ఉండి: ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన బాలిక దివ్యాన్‌ ఫణిశ్రీ వెలిగట్ల గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఏడు వేల మందితో నిర్వహించిన సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో దివ్యాన్‌ ఫణిశ్రీ పాల్గొని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో భాగమైనట్లు బాలిక తండ్రి సత్యప్రసాద్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాలికకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌తో పాటు జ్ఞాపికను అందజేసినట్లు చెప్పారు. కొంతకాలంగా కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ హైదరాబాద్‌లోనే ఉండి చదవుకుంటున్న తన కుమార్తె ప్రపంచ రికార్డు సాధనలో భాగం అయినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిశ్రీకి పలువురు అభినందనలు తెలిపారు.

జంగారెడ్డిగూడెం: వైకుంఠ ఏకాదశి, మంగళవారం సందర్భంగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి వారి దేవస్థానమునకు ఉపాలయం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పి.ధర్మరాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.4,45,370 ఆదాయం సమకూరినట్టు ఈవో తెలిపారు. 4,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో ఆర్‌వీ చందన చెప్పారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 28వ ఐపీఎస్‌జీఎం–2025 రీజనల్‌ మీట్‌ క్రీడా పోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను ఏలూరు సర్‌ సీఆర్‌రెడ్డి పాలిటెక్నిక్‌ విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ప్రధానాచార్యులు డి.ఫణీంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, కోకో, షటిల్‌, అథ్లెటిక్స్‌ పోటీలు జరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రభుత్వ, 10 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలోని 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు నిట్‌ రిజిస్ట్రార్‌ దినేశ్‌ శంకరరెడ్డి హాజరుకాగా కాకినాడ ఆర్‌జేడీటీఈ పి.సుబ్రహ్మాణ్యం, సివిల్‌ హెచ్‌ఓడీ జీవీవీఎల్‌ సత్యనారాయణ, మెకానికల్‌ హెచ్‌ఓడీ ఎ.గోపి, పీడీ కమల్‌ బాషా, విశ్రాంత పీడీ కె.రవికుమార్‌ పర్యవేక్షించారు. రీజనల్‌ మీట్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు.

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు 1
1/3

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు 2
2/3

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు 3
3/3

కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement