అండర్–14 క్రికెట్ జట్టుకు దీపక్ ఎంపిక
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్న కే.సూరిబాబు కుమారుడు కే.సాయిదీపక్ అండర్–14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శివకిషోర్ బాలుడు దీపక్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ... క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. హోంగార్డు కుటుంబం నుంచి రాష్ట్రానికి అండర్–14 క్రికెట్ జట్టులో స్థానం సాధించటం సంతోషంగా ఉందనీ, మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ పవన్‌కుమార్, తండ్రి సూరిబాబు ఉన్నారు.


