ఆహ్లాదం.. పాపికొండల విహారం
పాపికొండల దగ్గరగా అటవీశాఖ నిర్మించిన కాటేజీలు
బుట్టాయగూడెం: చుట్టూ ఎత్తయిన పర్వతశ్రేణులు.. వాటి మధ్యలో గలగలా గోదావరి ప్రవాహం. ఆ కొండల్లో పచ్చటి వృక్షాలు, పక్షుల కిలకిలరావాలు, ఎటు చూసినా ప్రకృతి రమణీయత, సుందర దృశ్యాల సమాహారం పాపికొండల విహారం. ఏలూరు, రంపచోడవరం జిల్లాల నడుమ తూర్పు కనుమల్లో దట్టమైన అడవుల్లో కూడిన పర్వతశ్రేణి పాపికొండలు. ఇంతటి విశిష్టత కలిగిన పాపికొండల పర్యాటకంపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొరుటూరు సమీపంలో ఉడెన్ కాటేజీలు నిర్మించి పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాపికొండల అందాలను తిలకించేలా ఏర్పాట్లు చేసింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఉన్న బోటు పాయింట్ నుంచి కొరుటూరు ఫారెస్ట్ కాటేజీలకు చేరుకున్న పర్యాటకులు బస చేసి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించవచ్చు.
15 పర్యాటక కాటేజీలు
పాపికొండల పర్యాటకుల కోసం కొరుటూరు సమీపంలోని ఎత్తయిన కొండప్రాంతంలో 15 కాటేజీలు నిర్మించారు. వీటిలో ఉడెన్ కాటేజీలు 5, బేంబో కాటేజీలు 5, టెంట్ హౌస్‌లు 5 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు శివగిరి సమీపంలో పర్యాటకుల సౌకర్యార్థం కాటేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కాటేజీలు మొత్తం పాపికొండలకు అతిసమీపంలోనే ఉన్నాయి. ఎత్తయిన కొండపై వీటిని నిర్మించడంతో అక్కడి నుంచి పాపికొండల అందాలతోపాటు గోదావరి నదిపై బోట్లను, ప్రకృతి అందాలను కూడా తిలకించవచ్చు. అదేవిధంగా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ చేసే సమయంలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బంది వారితోపాటు కొండపైకి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
పాపికొండల పర్యాటకుల కోసం ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కాటేజీలు ఏర్పాటు చేశాం. కాటేజీలకు సోలార్ ద్వారా విద్యుత్ సదుపాయం కూడా కల్పించాం. పర్యాటకుల మనసుదోచేలా కాటేజీల నిర్మాణం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగానే కాటేజీల ధర నిర్ణయించారు.
– ఎస్‌కె వల్లి, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్
కొరుటూరు సమీపంలో ఫారెస్ట్ శాఖ నిర్మించిన ఉడెన్ కాటేజీలు
అటవీశాఖ ఏర్పాటు చేసిన టెంట్ హౌస్‌లు
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
అటవీశాఖ ఆధ్వర్యంలో కాటేజీల ఏర్పాటు
పర్యాటకులకు ట్రెక్కింగ్‌కు కూడా అవకాశం
ఆహ్లాదం.. పాపికొండల విహారం
ఆహ్లాదం.. పాపికొండల విహారం
ఆహ్లాదం.. పాపికొండల విహారం
ఆహ్లాదం.. పాపికొండల విహారం


