
ఈఏపీసెట్‌కు సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పూర్తిచేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఈఏపీ సెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా నుంచి 6,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో సెషన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతాయి.
6,865 మంది విద్యార్థులు
ఏలూరు జిల్లా నుంచి 6,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంజనీరింగ్ కోర్సులకు 4,863 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 1,991 మంది, ఈ రెండు కోర్సులకు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వీటిలో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాల, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమ తించరు.సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెల్‌లనూ అనుమతించరు. పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఫారం, అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. విద్యార్థులు ఒక గంట ముందుగానే వారికి కేటాయిం చిన కేంద్రాల్లో రిపోర్ట్ చేయడం ఉత్తమం.
– పి.బాలకృష్ణ ప్రసాద్,
ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్
19 నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో..
21 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు
జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు
6,865 మంది విద్యార్థుల హాజరు
జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, సీట్లు
కళాశాల సీట్లు
ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ 1,200
ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ 900
ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల 600
హేలాపురి కళాశాల, ఏలూరు 360
ఎన్‌ఆర్‌ఐ కళాశాల, ఆగిరిపల్లి 1,360
సారథి ఇంజనీరింగ్ కళాశాల,
నూజివీడు 420

ఈఏపీసెట్‌కు సర్వం సిద్ధం