భీమవరంలో తిరంగా ర్యాలీ
భీమవరం: పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం భీమవరంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడారు. పట్టణంలో విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి అల్లూరి సీతారామ రాజు స్మృతివనం వరకు ర్యాలీ సాగింది. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
పరిశుభ్రతతో ఆరోగ్యం
భీమవరం: భీమవరంలోని పోలీసు ప్రధాన కా ర్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అధికారులు, సిబ్బంది కార్యా లయ ఆవరణలోని చెత్త, పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం కార్యాలయ ఆవరణలో పరిశుభ్రతను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నా రు. పరిశుభ్రతతో ఆరోగ్యం చేకూరుతుందన్నా రు. ప్లాస్టిక్ వాడకాన్ని వీడాలని కోరారు. అద నపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పె షల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు, ఏఆర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) డి.సురేష్, ఏఆర్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకట్రావు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి ప్రారంభించనున్నట్టు ఏలూరు జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీ య పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ప్రకటనలో తెలిపారు. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రాంగణంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి మూల్యాంకన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారన్నారు. ఆయా సబ్జెక్టులకు నియమించింన చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు సోమవారం ఉదయం 10 గంటలకు, స్కూృటినైజర్లు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు శిబిరం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు.
సచివాలయ కార్యదర్శి సస్పెన్షన్
చింతలపూడి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పాత చింతలపూడి సచివాలయ కార్యదర్శి కె.గంగా భవానీని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు జీఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్ విషయంలో అల సత్వం వహించడంతో పాటు, జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరవడం తదితర అంశాలపై సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇద్దరు గ్రామ కార్యదర్శులపై..
సాక్షి టాస్క్‌ఫోర్స్: హౌస్‌హోల్డ్ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కారణంగా జిల్లాలో ఇద్దరు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు గ్రామ, వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో జిల్లాలోని భీమడోలు గ్రామ కార్యదర్శి కేవీ లక్ష్మీ తనూజ, టి.నరసాపురం గ్రామ కార్యదర్శి ఉన్నట్టు సమాచారం. దీనిపై భీమడోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో 4,009 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 3,413 మందికి 3,184 మంది, ఒకేషనల్ పరీక్షలకు 443 మందికి 151 మంది హాజరయ్యారు.


