
వాహనంలో రేడియేటర్ పేలి బాలికకు గాయాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన జంటగోపురాల ప్రాంతంలో మంగళవారం ఓ భక్తుడి పాల వాహనంలోని రేడియేటర్ పేలి అందులోని బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం. దెందులూరు మండలం పోతునూరుకు చెందిన ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ పాల వ్యాన్‌ను కొనుగోలు చేశాడు. దానికి పూజలు చేసేందుకు భార్య, ఇద్దరు పిల్లలతో కలసి శ్రీవారి క్షేత్రానికి వచ్చాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి వాహనంలోని రేడియేటర్ ఒక్కసారిగా పేలింది. దాంతో బాలికపై రేడియేటర్‌లోని వేడి నీరు పడి ఆమెకు గాయాలయ్యాయి. ఆ సమయంలో వాహనం డోర్‌లు తెరచుకోక పోవడంతో అందులో ఉన్నవారంతా పెద్దపెద్ద కేకలు వేశారు. దాంతో స్థానికులు, భక్తులు వాహనం వద్దకు చేరుకుని, ఎంతగానో శ్రమించి డోర్‌లు తెరిచారు. గాయపడిన బాలికను ఆలయ ఆవరణలోని ప్రథమచికిత్సా కేంద్రానికి తరలించి, కాలికి చికిత్స చేయించారు.

వాహనంలో రేడియేటర్ పేలి బాలికకు గాయాలు