బడి బస్సు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

బడి బస్సు భద్రమేనా?

May 14 2025 1:07 AM | Updated on May 14 2025 1:07 AM

బడి బ

బడి బస్సు భద్రమేనా?

బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025

సాక్షి, భీమవరం / భీమవరం (ప్రకాశంచౌక్‌) : జిల్లాలో 463 ప్రైవేట్‌ విద్యాసంస్థల పరిధిలో 1,566 స్కూల్‌ బస్సులు ఉన్నాయి. విద్యార్థుల ప్రయాణ భద్రత దృష్ట్యా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణ శాఖ స్కూల్‌ బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించి పూర్తి సామర్థ్యంతో ఉన్న వాటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు(ఎఫ్‌సీ) జారీచేయాలి. ఎఫ్‌సీ లేనివాటిని సీజ్‌ చేయాలి. గత ఏడాది ఎఫ్‌సీ గడువు ముగియడంతో రానున్న విద్యాసంత్సరానికి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని రవాణశాఖ కార్యాలయాల్లో బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేపట్టి సోమవారం నాటికి 849 బస్సులకు పూర్తి చేశారు.

తూతూమంత్రంగా తనిఖీలు

బస్సు బ్రేక్‌, హ్యాండ్‌ బ్రేక్‌, స్టీరింగ్‌, టైర్లు, స్పీడో మీటర్‌, లైట్లు, గ్లాసులు, అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం తదితర వాటి కండిషన్‌ను మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు స్వయంగా పరీక్షించాలి. బస్సుకు నాలుగు వైపులా రిఫ్లెక్టివ్‌ టేపు అతికించి ఉందా? లేదా? ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, బస్సు బయలుదేరే సమయం, ఆగే స్థలాలు, రూట్‌ ప్లాన్‌ వివరాలు వంటివి పరిశీలన చేయాలి. ఆ బాధ్య తను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి తూతూమంత్రంగా తనిఖీలు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ చూసీచూడనట్లు వదిలేస్తున్నట్టు తెలుస్తోంది.

కొరవడిన పర్యవేక్షణ

స్కూల్‌ బస్సుల వేగం గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే ఉండేలా స్పీడ్‌ గవర్నర్స్‌ తప్పనిసరి. కాగా కొందరు డ్రైవర్లు ఇరుకు సందుల్లో వేగంగా పోనిస్తూ దారిన వెళ్లే వారిని హడలెత్తిస్తున్నారు. కొందరు విధుల్లో మద్యం సేవించి ఉంటున్నారని, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో జరిగిన పలు ప్రమాదాలకు నిర్లక్ష్య డ్రైవింగ్‌, వాహనాలు కండీషన్‌లో లేకపోవడం కారణమన్న విమర్శలున్నాయి. అధికారులు, స్కూల్‌ యాజమాన్యాల పర్యవేక్షణ కొరవడటం డ్రైవర్ల ఇష్టారాజ్యంగా మారుతోంది.

పేరెంట్స్‌ కమిటీ పరిశీలించాలి

బస్సులోని ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ను నెలకోసారి పేరెంట్స్‌ కమిటీ పరిశీలించాలి. సీటింగ్‌ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. ప్రతి నెల బస్సు కండిషన్‌ను యాజమాన్యాలు, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ తనిఖీ చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకం ఉంచి ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేసి ఫిర్యాదులను పరిశీలించాలి. రవాణా, పోలీస్‌, విద్యా శాఖల సౌజన్యంతో విద్యార్థులకు రోడ్‌ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి.

న్యూస్‌రీల్‌

ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు

గతేడాది వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, పలువురికి గాయాలు

సిబ్బంది చేతివాటం, తూతూమంత్రంగా తనిఖీలు

సెప్టెంబరు 20 : తణుకులోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సు జాతీయ రహదారిలోని డీమార్టు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకువెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లిప్టు కోసం ఎక్కిన మరో బస్సు క్లీనర్‌ మృతిచెందాడు.

డిసెంబరు 2 : ఇరగవరం మండలం అర్జునుడుపాలెం రోడ్డులో విద్యార్థులతో ఉన్న రెండు స్కూల్‌ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ వేగానికి అందులోని చిన్నారులు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన చిన్నారులను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

సెప్టెంబరు 10 : పెనుమంట్ర మండలం మాముడూరు నుంచి భీమవరం వస్తున్న ప్రైవేట్‌ కళాశాల బస్సు పాలకోడేరులో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకుపోయి మట్టిలో కూరుకుపోయింది. ప్రమాద సమయానికి బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఒకరికి కాలు, చేయి విరిగిపోయింది. 11 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు.

పక్కాగా ఫిట్‌నెస్‌ పరీక్షలు

అక్రమాలకు తావులేకుండా జిల్లాలో ఫిట్‌నెస్‌ పరీక్షలు పక్కాగా నిర్వహిస్తున్నాం. గత ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఫిట్‌నెస్‌ లేని బస్సులను సీజ్‌ చేస్తాం.

ఉమా మహేశ్వరరావు,

జిల్లా రవాణ శాఖ అధికారి, భీమవరం

రవాణ శాఖ స్కూల్‌ ఫిట్‌నెస్‌

కార్యాలయం బస్సులు పరీక్షలు

పూర్తయినవి

భీమవరం 557 298

పాలకొల్లు 331 166

తణుకు 234 142

తాడపల్లిగూడెం 444 243

బడి బస్సు భద్రమేనా? 1
1/3

బడి బస్సు భద్రమేనా?

బడి బస్సు భద్రమేనా? 2
2/3

బడి బస్సు భద్రమేనా?

బడి బస్సు భద్రమేనా? 3
3/3

బడి బస్సు భద్రమేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement