
7 కేంద్రాలు.. 15,707 మంది విద్యార్థులు
భీమవరం: ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఈఏపీసెట్ పరీక్షలు సోమ వారం నుంచి ఈనెల 27 వరకు జరుగనున్నాయి. జల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్షలకు 15,707 మంది హాజరుకానున్నారు. భీమవరంలో డీఎన్నార్ అటానమస్, డీఎన్నార్ ఇంజనీరింగ్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్, విష్ణు ఇంజనీరింగ్, విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్, నరసాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెంలో శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు. భీమవరంలోని ఐదు కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలకు 5,662 మంది, అగ్రి, ఫార్మసీ పరీక్షలకు 1,477 మంది, నరసాపురంలో ఇంజనీరింగ్ పరీక్షలకు 1,501, అగ్రి, ఫార్మసీ పరీక్షలకు 600 మంది, తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ పరీక్షలకు 4,527 మంది, అగ్రి, ఫార్మసీ పరీక్షలకు 1,911 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్న 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్ష సమయానికి 1.30 గంటల ముందు నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
నేటి నుంచి ఈఏపీసెట్