
సందేశాత్మకంగా నాటిక ప్రదర్శనలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు రెండోరోజు ఆదివారం కొనసాగాయి. అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభ లో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అంబికా కుటుంబ సేవలు అభినందనీయమన్నారు. ప్రముఖ సాహితీవేత్త, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెల్లో ప్రొఫెసర్ డాక్టర్ వేల్చేరు నారాయణరావుకు 11వ తానా–గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు గొర్రిపాటి చందు, వీఎల్‌ఎంఆర్ వెంకటరావు అందించి సత్కరించారు. నాటిక పోటీల్లో భాగంగా గోవాడ క్రియేషన్ (హైదరాబాద్) వారి అమ్మ చెక్కిన బొమ్మ, కృష్ణా ఆర్ట్స్–కల్చరల్ అసోసియేషన్ (గుడివాడ) వారి ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటికలు అలరించాయి.