
కలెక్టర్ నాగరాణికి సత్కారం
భీమవరం: అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహిళలను గౌరవించాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ అధ్వర్యంలో దివంగత ఉద్దరాజు వెంకట లక్ష్మీనరసయ్య 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆనంద ఫంక్షన్ హాల్లో ఆనంద సీ్త్ర పురస్కారాల ప్రదానం చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు సతీమణి అన్నపూర్ణ, ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా.కొల్లూరి వందన (తిరుపతి), జిల్లా వైద్య అధికారిణి గీతాబాయి, పోలీస్ శాఖ, ఆనంద గ్రూప్‌కు చెందిన ఆరుగురు ఉత్తమ సేవాతాత్పరులకు, 50 మంది మున్సిపల్ మహిళ పారిశుద్ధ్య కార్మికులకు పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో పౌండేషన్ చైర్మన్ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ్ రాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ, రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం : అక్రమంగా కలప రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు కన్నాపురం అటవీశాఖ అధికారి రేంజర్ శివరామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. యర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య బండారు జాతికి చెందిన భారీ వృక్షాలను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందని పేర్కొన్నారు.
చాట్రాయిలో భారీ వర్షం
చాట్రాయి : చాట్రాయిలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొటపాడులో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా చెట్లు కూలిపోయాయి. ఈ వర్షం మెట్ట దుక్కులకు అనువుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. చనుబండ పాత దళితవాడ రోడ్డు జలమయవ్వడంతో కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు
కొయ్యలగూడెం : లారీతో ఢీకొట్టి వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ శుక్రవారం పేర్కొన్నారు. 2018లో చెరుకూరి నరసింహ కొయ్యలగూడెం చేపల మార్కెట్ వద్ద పులిరామన్నగూడెంకు చెందిన నడపాల మంగిరెడ్డిని ఢీకొట్టాడు. దీనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా కొవ్వూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి జీవీఎల్ సరస్వతి శిక్ష విధించారన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారన్నారు.

కలెక్టర్ నాగరాణికి సత్కారం

కలెక్టర్ నాగరాణికి సత్కారం