
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: స్థానిక లింగయ్య చెరువు వద్ద పడిపోయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. లింగయ్య చెరువు వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మంగళవారం ఉదయం పడిపోయాడు. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 94407 96653కు సమాచారం అందించాలని ఆయన కోరారు.
చికిత్స పొందుతూ జట్టు కూలీ మృతి
భీమడోలు: గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద తవుడు లారీ బోల్తా ఘటనలో జట్టు కూలీ గొర్జి శ్రీనివాసరావు(52) బుధవారం మృతి చెందాడు. ఈనెల 20వ తేదీ సాయంత్రం రత్నాపురంలోని ఆక్వా చెరువుల వద్దకు తవుడు బస్తాలను దిగుమతి చేసేందుకు ఏడుగురు జట్టు కూలీలు లారీ ఎక్కారు. గుండుగొలను నుంచి రత్నాపురం వెళ్తుండగా మార్గమధ్యమైన గుండుగొలను బీసీ కాలనీ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో తీవ్ర గాయాలైన గొర్జి శ్రీను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సెల్‌ఫోన్ల రికవరీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): రైలు ప్రయాణికులు పొగొట్టుకున్న సెల్‌ఫొన్లను సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా రైల్వే పోలీసులు దొంగల వద్ద నుంచి రికవరీ చేశారు. వీటి విలువ రూ.1,50,000గా నిర్థారించారు. ఫొన్‌లు పొగొట్టుకున్న ప్రయాణికులను బుధవారం పట్టణంలోని రైల్వే పోలీస్ స్టేషన్‌కి పిలిపించి సెల్‌ఫొన్లను అందజేశారు. కార్యక్రమంలో రైల్వే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఈ.అప్పారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి