
ప్రొటోకాల్‌పై జనసైనికుల ఫైర్
పవన్ కళ్యాణ్‌కు సరైన గౌవరం దక్కడం లేదంటూ ఆవేదన
నరసాపురం రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 164 స్థానాలు గెలుపొందేందుకు ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రొటోకాల్ విషయంలో సరైన గౌరవం దక్కడం లేదంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం మండలంలోని లిఖితపూడి గ్రామంలో సోమవారం జరిగిన ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫొటో మంత్రుల ఫొటోలతో సమానంగా వేయడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి ఫోటోను ఆ స్థానంలో పెట్టడం కరెక్టుకాదన్నారు. ఆలా చేయడం జనసైనికులందరినీ బాధిస్తుందన్నారు. ఇక మీదట నరసాపురం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో సీఎం చంద్రబాబు ఫొటోతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటో వేయాలని అధికారులకు సూచించారు.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
ఉండి: యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం ఉండి మండలం పెదపుల్లేరు గ్రామానికి చెందిన యువతి సోమవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆమె మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్
పెదపాడు: మండలంలోని వీరమ్మకుంట గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వ్యాన్‌ను సోమవారం సీజ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రైవర్, యజమాని, చేపల చెరువు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.