నేత్ర పర్వం.. రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్ర పర్వం.. రథోత్సవం

May 13 2025 12:39 AM | Updated on May 13 2025 12:39 AM

నేత్ర

నేత్ర పర్వం.. రథోత్సవం

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామికి జరిగిన రథోత్సవం నేత్రపర్వమైంది. చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రాత్రి రథత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నా రు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాదికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తదితరులు రథం వద్ద పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాద్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు రాజమన్నార్‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

బ్రహ్మోత్సవాల్లో నేడు :

● ఉదయం 7గంటల నుంచి–భజన కార్యక్రమాలు

● 8 గంటల నుంచి – భక్తిరంజని

● 9 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు

● 10.30 గంటల నుంచి–చక్రవారి–అపభృధోత్సవం

● మధ్యాహ్నం 3 గంటల నుంచి – వేద సభ

● సాయంత్రం 4 గంటల నుంచి–నాదస్వర కచేరీ

● 5 గంటల నుంచి – సంగీత విభావరి

● రాత్రి 7 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శన

● 8 గంటల నుంచి – పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ

● 9 గంటల నుంచి–అశ్వవాహనంపై గ్రామోత్సవం

శ్రీవారి ప్రత్యేక అలంకారం – కాళీయమర్దనం

నేత్ర పర్వం.. రథోత్సవం 1
1/2

నేత్ర పర్వం.. రథోత్సవం

నేత్ర పర్వం.. రథోత్సవం 2
2/2

నేత్ర పర్వం.. రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement