
బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళల బైఠాయింపు
బుట్టాయగూడెం: రెడ్డిగణపవరం బ్యాంక్ ఎదుట గాడిదబోరు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం బైటాయించారు. బ్యాంకు రుణాలు మంజూరు చేసిన విషయం తమకు తెలియదని, దీంతో తాము వడ్డీ నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మేనేజర్ కుమార్, ఏపీఎం పద్మావతి మాట్లాడుతూ రుణాల సొమ్ములు డ్వాక్రా సంఘాల ఖాతాలోనే ఉన్నందుకు వాటిని తిరిగి రికవరీ చేయడంతోపాటు, వారికి ఎటువంటి వడ్డీ పడకుండా ఉండేలా మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో డ్వాక్రా మహిళలు శాంతించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోడే సత్యదుర్గాప్రసాద్, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.