
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెచ్‌సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసపురానికి చెందిన రాజులపాటి అప్పారావు, ప్రియాంకలకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పారావు చికెన్ షాపు పెట్టి జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అప్పారావును ప్రియాంక పలుమార్లు వారించి, పెద్దలలో సైతం పెట్టినా అతడు మద్యాన్ని విడిచిపెట్టలేదు. దీంతో 15 రోజుల క్రితం పిల్లలను తీసుకుని ప్రియాంక అక్కంపేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పారావు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ప్రియాంక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్న ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
పెదవేగి: ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం భోగాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరాజు (36) మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి దుగ్గిరాల ట్రాక్టర్‌పై వెళుతుండగా అమ్మపాలెం జాతీయ రహదారి సమీపంలో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై నుంచి నాగరాజు రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ చెప్పారు. మృతదేహాన్ని శవపంచనామ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.