మాక్‌డ్రిల్‌తో అప్రమత్తం
భీమవరం (ప్రకాశంచౌక్): మాక్‌డ్రిల్ అవగాహన అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అనే అంశాలపై ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా బుధవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో కలెక్టర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిలెండర్ నుంచి గ్యాస్ లీకేజీని, మంటలను ఎలా కట్టడి చేయిచ్చో కలెక్టర్ స్వయంగా చేసి చూపించారు. ఎస్పీ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అనేక అనర్ధాలు జరుగుతాయని, ఇలాంటి మాక్‌డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏ.శ్రీనివాసరావు ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాక్‌డ్రిల్‌తో అప్రమత్తం


