15వ రోజుకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమ్మె
భీమవరం: భీమవరం కలెక్టరేట్ సమీపంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 15వ రోజుకు చేరుకుంది. ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు పి.శిరీష రాణి, సెక్రటరీ కె.విజయ సీతారామరాజు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డులు అందించాలని, హెచ్‌ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్‌ఫర్ తదితర డిమాండ్లతో గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.


