ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్య శాఖలోని ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గురువారం భీమవరంలో రాష్ట్ర ఆరోగ్య ఎంపీఈఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుడాల హరిబాబు అధ్యక్షతన ఎన్నిక జరిగింది. సంఘ అధ్యక్షుడిగా కడలి శాంతమూర్తి, సహ అధ్యక్షుడిగా జి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జె.సత్యనారాయణ, పి.సుకుమార్, పి.ప్రభాకర్, జనరల్ సెక్రటరీగా ఏఎస్‌ఎన్ మూర్తి, జా యింట్ సెక్రెటరీగా సీహెచ్ సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా యు.ప్రసాద్, ట్రెజరర్‌గా కె.అప్పారావు, ఈసీ మెంబర్లుగా ఎస్వీఎస్ ప్రసాద్, ఎం.ఫాల్‌సన్‌ను ఎన్నుకున్నారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఉప కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్న వై.భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియడంతో భద్రాజీకి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ద్వారకాతిరుమల: ఏడాదంతా శుభప్రదం కా వాలని కోరుతూ.. వేలాది మంది భక్తులు గు రువారం చిన వెంకన్నను దర్శించారు. దీంతో ద్వారకాతిరుమల క్షే త్రం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. క్షేత్రంలోని అన్ని విభాగాల్లో భక్తులతో రద్దీ కనిపించింది. పార్కింగ్ ప్రదేశాలు వాహ నాలతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు స్వా మివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం వరకూ క్షేత్రంలో రద్దీ కొనసాగింది. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు అధికారులు పలు సౌకర్యాలు కల్పించారు.
ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు
ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు


