
సమస్యలపై ప్రజాపోరు
వేసవిలో వాహనాలు జాగ్రత్త
వేసవిలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలతో వాహనాలు దెబ్బతింటాయని మెకానిక్‌లు చెబుతున్నారు. IIలో u
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఏలూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. IIలో u
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్‌లోపు ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామస్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయా లని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన ని ర్వహించిన ఆందోళనలపై సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లాస్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత వి స్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కో సం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
సమావేశంలో పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పార్లమెంటరీ కో–ఆర్డినేటర్లు కారుమూరి సునీల్‌కుమార్, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్ గుడాల గోపి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
ప్రజలతో నేతలు మమేకమవ్వాలి
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ
ఆక్వా రైతులకు వెన్నుదన్ను
క్షేత్రస్థాయి పర్యటనలకు అధినేత జగన్
ప్రతి 10 రోజులకూ జిల్లా సమావేశం
త్వరలో మండల, గ్రామ కమిటీల నియామకం
పార్టీ నేతలకు రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స దిశానిర్దేశం
కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ సమావేశం

సమస్యలపై ప్రజాపోరు