
గూడెంలో భారీ వర్షం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్‌లు పొంగి ప్రవహించాయి. చాలా రోడ్లు కాలువల్లా దర్శనమిచ్చాయి. దాదాపు గంటన్నరకు పైగా సాధారణ జన జీవనం స్తంభించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులకు అంతరాయం ఏర్పడింది. మునిసిపల్ హెహికల్ డిపో ఎదురుగా సీసీ రహదారి కల్వర్టుకు అడ్డంకి ఏర్పడటంతో బురద నీరు రోడ్డుపైకి చేరింది. అనేక ప్రాంతాలు చెత్త చెదారాలతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. బస్టాండ్‌లో నీరు నిలిచిపోయింది. కె.ఎన్.రోడ్డులో అనేక చోట్ల మార్జిన్‌లలో నీరు నిలిచిపోవడంతో వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. అయితే చల్లని గాలులతో పట్టణ ప్రజలు సేదదీరారు.
భీమవరం మండలంలో..
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, అనాకోడేరు, కొమరాడ, తోకతిప్ప, కొత్తపూసలుమర్రు తదితర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. దీంతో పలు గ్రామాలలోని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గూడెంలో భారీ వర్షం

గూడెంలో భారీ వర్షం