
పిప్పర పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
గణపవరం: గణపవరం మండలం పిప్పర పంటకాల్వలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈవిషయంపై వీఆర్‌వో గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి వయస్సు 60 సంవత్సరాలు ఉంటుందని, కాల్వలో పడి ఎలా మరణించాడన్న విషయం తెలియరాలేదని, వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగగుంట గ్రామంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15)కు వివాహం నిశ్చయించినట్లు 1098కు సమాచారం అందడంతో సోమవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు దుర్గాభవాని, బేబి బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఐసీడీఎస్, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ వారి ఆదేశాల మేరకు బాలికను వన్ స్టాప్ సెంటర్‌కు తరలించినట్లు సూపర్‌వైజర్లు తెలిపారు. సచివాలయ జీఎంఎస్‌కే యు.సంధ్య, అంగన్‌వాడీ వర్కర్ కే.గంగారత్నం తదితరులు ఉన్నారు.
గుండెపోటుతో
ఉపాధి కూలీ మృతి
పెంటపాడు: ఉపాధి హామీ పనులు చేస్తున్న ఓ కూలీ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెంటపాడు మండలం ముదునూరు గ్రామానికి చెందిన చల్లా రామారావు (81) సోమవారం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాడు. పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. తమతోపాటు పనులకు వచ్చిన రామారావు అకస్మాత్తుగా చనిపోవడంతో మిగిలిన ఉపాధి కూలీలు విలపించారు. కాగా పని ప్రదేశంలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉండగా పలు గ్రామాల్లో కనీసం మందులు సరఫరా చేసేవారు కూడా రావడం లేదని కూలీలు చెబుతున్నారు.
చోరీ కేసులో
నిందితుడికి రిమాండ్
భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళను బెదిరించి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ ఎం. నాగరాజు తెలిపారు. వి. రామాకుమార్ పోలీసు బొమ్మ కూడలి వద్ద గతంలో సెల్‌ఫోన్ దుకాణం నిర్వహించేవాడు. ఓ మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న 4 కాసుల బంగారు ఆభరణాలు అపహరించాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో సోమవారం హాజరుపరచగా అతడికి రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు.

పిప్పర పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

పిప్పర పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం