
వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
తాడేపల్లిగూడెం: వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్‌సీపీ నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. పార్లమెంటులోని నియోజకవర్గాల పర్యటనలో భాగంగా సోమవారం గూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన పోరాడాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని పథకాలు కొనసాగుతాయని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని.. ప్రతి ఇంటికి తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.