తాడేపల్లిగూడెం రూరల్/తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ మండలంలో బంగారుగూడెం, పట్టెంపాలెం, కొమ్ముగూడెం, నీలాద్రిపురం, కడియద్ద, చినతాడేపల్లి గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం 5.30 గంటల నుంచి ఈదురుగాలులు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహ దారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెదతాడేపల్లిలోని ప్రధాన సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యతో పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లలో సరఫరా నిలిచిపోయింది. రాత్రి 7.30 గంటల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
గూడెంలో భారీ వర్షం