
జ్యూయలరీ షాపుల్లో తనిఖీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రీజినల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్, జీఎస్‌టీ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా బంగారం, వెండి దుకాణాల్లో తనిఖీలు చేశారు. నగరంలోని సరస్వతి సిల్వర్ ప్యాలెస్, శుభం జ్యూయలరీ షాపుల్లో తనిఖీ చేయగా.. సరస్వతి సిల్వర్ ప్యాలెస్‌లో 160 గ్రాముల బంగారం, 5,400 గ్రాముల వెండి స్టాక్ రిజిస్టర్ కన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి జీఎస్‌టీ అధికారులు రూ.1,15,468 అపరాధ రుసుం విధించారు. అలాగే సరస్వతి సిల్వర్ ప్యాలెస్‌లో ఎటువంటి ధ్రువీకరణ లేని రెండు ఎలక్ట్రానిక్ కాటాలు గు ర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు న మోదు చేశారు. విజిలెన్స్ సీఐ పి.శివరామకృష్ణ, ఎస్సై కె.సీతారాము, తహసీల్దార్ బి.కన్యాకుమారి, తూనికలు, కొలతల శాఖ అధికారి ఈశ్వరరామ్, జీఎస్‌టీ అధికారి వినోదరావు పాల్గొన్నారు.