
కాంట్రాక్టు బస్సులపై 85 కేసులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 85 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా కమిషనరు ఆదేశాల మేరకు కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలోని వాహన తనిఖీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను తనిఖీలు చేసి.. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన 85 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.3.70 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో ఆర్టీవో ఎండీ. మదని తదితరులు తెలిపారు.