Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Amrit Bharat Station Scheme PM Modi to Inaugurate 103 Redeveloped Rrailway Stations1
నేడు ప్రధాని మోదీ ‍ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్‌లో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.అమృత్‌ భారత్‌ స్టేషన్‌(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.అస్సాం: హైబర్‌గావ్బీహార్‌: పిర్పైంటి, థావే.ఛత్తీస్‌గఢ్‌: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.గుజరాత్‌: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్‌పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.హర్యానా: మండి దబ్వాలి.హిమాచల్ ప్రదేశ్‌: బైజ్నాథ్ పప్రోలా.జార్ఖండ్‌: శంకర్‌పూర్, రాజమహల్, గోవింద్‌పూర్ రోడ్.కర్ణాటక: మునీరాబాద్, బాగల్‌కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.కేరళ: వడకర, చిరాయింకీజ్.మధ్యప్రదేశ్‌: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.మహారాష్ట్ర: పరేల్, చించ్‌పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్‌గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్‌లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్‌ఎస్‌బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్‌గావ్. పుదుచ్చేరి: మహే.రాజస్థాన్‌: ఫతేపూర్ షెఖావతి, రాజ్‌గఢ్, గోవింద్ గర్, దేశ్‌నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.ఉత్తరప్రదేశ్‌: బిజ్నోర్, సహరాన్‌పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్‌నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్‌ఘాట్ హాల్ట్, సురైమాన్‌పూర్, బల్‌రామ్‌పూర్.పశ్చిమ బెంగాల్‌: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్‌చండీ పహార్.ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..

Nampally Court Key Orders Prabhakar Rao In Phone Tapping Case2
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ప్రభాకర్ రావుకు బిగ్‌ షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్‌ రావుకు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రోక్లేయిమ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు.తాజాగా ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Nita Ambani Sanitises Bumrah Palm Before Handshake After MI Beat DC3
MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్‌

గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్‌ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్‌-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్‌ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్‌ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్‌ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్‌ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్‌ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్‌ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్‌-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌కు ఇటీవల కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్‌ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్‌లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్‌ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్‌ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌ తదితరులకు సానిటైజర్‌ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్‌ ఓడిన ముంబై ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో రోహిత్‌ శర్మ (5) విఫలం కాగా.. రియాన్‌ రెకెల్టన్‌ (25) ఫర్వాలేదనిపించాడు. విల్‌ జాక్స్‌ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్‌ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌), నమన్‌ ధిర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్‌ చేసింది. జస్‌ప్రీత్‌ బుమ్రా, మిచెల్‌ సాంట్నర్‌ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చహర్‌, విల్‌ జాక్స్‌, కర్ణ్‌ శర్మ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్‌ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025

USA Donlad Trump Slams Reporter Over Qatar Jet Question4
ట్రంప్‌కు కోపమొచ్చింది.. ఏం మాట్లాడుతున్నావ్‌ వెళ్లిపో అంటూ..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది. ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్‌?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్‌ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ట్రంప్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్‌.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్‌బీసీ ఛానెల్‌ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్‌ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్‌ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్‌ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్‌ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. President Trump Slams NBC reporter 🔥 "GET OUT OF HERE"You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. And you're a disgrace. No more questions… pic.twitter.com/ezuE4vXstc— Steve Gruber (@stevegrubershow) May 21, 2025

SS Rajamouli Movie RRR Creates another Record in London5
అప్పుడు బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్.. రెండు చిత్రాలు మన దర్శకధీరుడివే!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈ మూవీని లండన్‌లో ప్రముఖ రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఆర్ఆర్ఆర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ ఘనతను దక్కించుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. రాయల్‌ అల్బర్ట్‌ హాల్ స్థాపించి ఇప్పటి వరకు దాదాపు 154 ఏళ్లు పూర్తయింది. ఈ హాల్‌ స్థాపించాక ప్రదర్శించిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి మాత్రమే నాన్ ఇంగ్లీష్‌ చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది. 2019లో బాహుబలి మూవీని ఇదే హాల్‌లో ప్రదర్శించారు.తాజాగా 2025లో ఆర్ఆర్ఆర్‌ ఈ ఘనతను సాధించింది. బాహుబలి తర్వాత ఈ రికార్డ్ సాధించిన రెండో నాన్ ఇంగ్లీష్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకధీరుడికే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ భారీ అడ్వెంచరస్‌ మూవీని తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ప్రస్తుతం షూటింగ్‌కు విరామం లభించడంతో రాజమౌళి లండన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు.An SS Rajamouli Film… Does it again!! 🔥🌊 HistorRRRy continues at @RoyalAlbertHall!#RRRMovie is the second non-English film after Baahubali since its inauguration 154 years ago. ✊🏻 https://t.co/AJ9Od2mnD4 pic.twitter.com/FMf5UWHBKM— RRR Movie (@RRRMovie) May 21, 2025

HYDRA Demolish Constructions In  Boduppal6
హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్‌లో కబ్జాలు..

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్‌.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో​ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

Health Tips: Dance as Therapy for Individuals with Parkinson Disease7
డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..! పార్కిన్‌సన్స్‌కు నృత్య చికిత్స

అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్‌సన్స్‌’ డిసీజ్‌ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ అయిన విషయమే అంటోంది ‘ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి). పార్కిన్‌సన్‌లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్‌లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్‌సన్స్‌ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్‌ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్‌సన్స్‌ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్‌సన్స్‌లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే. తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్‌. పార్కిన్‌సన్స్‌లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్‌ కంట్రోల్‌) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్‌సన్స్‌ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి.నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్‌సన్స్‌ మెదడు క్రియాశీలతను, డోపమైన్‌ కేంద్రమైన ‘బేసల్‌ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్‌లు (పార్కిన్‌సన్స్‌ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్‌ ఆడిటరీ స్టిమ్యులేషన్‌ (ఆర్‌.ఎ.ఎస్‌.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్‌లు, సెరోటోనిన్‌ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్‌ హార్మోన్‌లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు.గర్బా నృత్యంపై తొలి ప్రయోగంగుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్‌సన్స్‌ రోగులపై ఈ డ్యాన్స్‌ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్‌సన్స్‌కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్‌సన్స్‌ డిసీ జ్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది. అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్‌కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి.పార్కిన్‌సన్స్‌ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్‌సన్స్‌కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్‌ అవసరం. డోపమైన్‌ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్‌ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్‌సన్స్‌ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్‌ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు.రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు. ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు.సాక్షి నేషనల్‌ డెస్క్‌(చదవండి: హీరో శింబు ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..)

How Next Gen Entrepreneurs Redefining Family Business Succession8
‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథం

భారతదేశంలో తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారాల దృక్పథంలో మార్పులు వస్తున్నాయి. భారతీయ పారిశ్రామికవేత్తలు 79% మంది తమ వ్యాపారాలను వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ అది వెంటనే జరిగిపోవాలని అనుకోవడం లేదని హెచ్‌ఎస్‌బీసీ సర్వే తెలిపింది. అయితే అలా యోచిస్తున్న మొత్తం పారిశ్రామికవేత్తల్లో 45% మంది ప్రస్తుతం సమర్థంగా కొనసాగుతున్నవారు ఉన్నారు. 55% మంది మొదటితరం వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరిలో 35% మంది విభిన్న తరాలకు చెందినవారు ఇకపై వారి పిల్లలు తమ సంస్థలను నడపబోరేమోనని చెబుతున్నారు. వారసత్వ బాధ్యతల కంటే వారి పిల్లలు వ్యక్తిగత ఆకాంక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.మొత్తంగా కేవలం 7 శాతం మంది భారతీయ వారసులు మాత్రమే కుటుంబ వ్యాపారాన్ని బాధ్యతగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇది చైనాలో 60%గా ఉంది. భారతీయ యువత తమ ముందున్న వ్యాపార వారసత్వాలకు కట్టుబడి ఉండటం కంటే వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే కెరియర్లను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలియజేస్తుంది. దేశంలో మొత్తంగా పారిశ్రామికవేత్తలు తమ వారసత్వానికి వ్యాపార బాధ్యతలు కట్టబెడితే సుమారు 1.5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సమానమైన సంపద బదిలీ జరుగుతుందని సర్వే తెలిపింది. ఇది దేశ జీడీపీలో 1/3వ వంతు ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: బంగారం, స్టాక్‌ మార్కెట్‌, కరెన్సీ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌గ్లోబలైజేషన్, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన కెరియర్‌ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నందున చాలా మంది యువ కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది వారి సొంత స్టార్టప్‌లను ప్రారంభించేందుకు దోహదం చేస్తుంది. వృత్తిపరమైన కెరియర్‌లను కొనసాగించడం లేదా పూర్తిగా భిన్నమైన పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుందని కొందరు భావిస్తున్నారు.

Trinamool MPs Team On IndiGo Plane Caught In Storm Srinagar9
మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన

శ్రీనగర్‌: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సాగరిక ఘోష్‌ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్‌, పాక్‌ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్‌ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.

IPL 2025 MI vs DC: BCCI Punished Delhi Capitals Pacer Mukesh Kumar10
MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు ఎదురుదెబ్బ

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ (Mukesh Kumar)కు ఐపీఎల్‌ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జత చేసింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.సూర్య, నమన్‌ ధనాధన్‌ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌), నమన్‌ ధిర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.ఢిల్లీ తడ‘బ్యా’టుఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (11), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ పోరెల్‌ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్‌ రిజ్వీ (39), విప్రాజ్‌ నిగమ్‌ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్‌ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అనుచిత ప్రవర్తనఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్‌ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్‌ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్‌ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్‌మెంట్‌ను డ్యామేజ్‌ చేయడం) ప్రకారం ముకేశ్‌ కుమార్‌ లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించి మ్యాచ్‌ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్‌ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్‌ కుమార్‌ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్‌ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్‌ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌ Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement