
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.
అమృత్ భారత్ స్టేషన్(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.
అస్సాం: హైబర్‌గావ్
బీహార్: పిర్పైంటి, థావే.
ఛత్తీస్‌గఢ్: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.
గుజరాత్: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్‌పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.
హర్యానా: మండి దబ్వాలి.
హిమాచల్ ప్రదేశ్: బైజ్నాథ్ పప్రోలా.
జార్ఖండ్: శంకర్‌పూర్, రాజమహల్, గోవింద్‌పూర్ రోడ్.
కర్ణాటక: మునీరాబాద్, బాగల్‌కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.
కేరళ: వడకర, చిరాయింకీజ్.
మధ్యప్రదేశ్: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.
మహారాష్ట్ర: పరేల్, చించ్‌పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్‌గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్‌లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్‌ఎస్‌బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్‌గావ్.
పుదుచ్చేరి: మహే.
రాజస్థాన్: ఫతేపూర్ షెఖావతి, రాజ్‌గఢ్, గోవింద్ గర్, దేశ్‌నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.
తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.
తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.
ఉత్తరప్రదేశ్: బిజ్నోర్, సహరాన్‌పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్‌నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్‌ఘాట్ హాల్ట్, సురైమాన్‌పూర్, బల్‌రామ్‌పూర్.
పశ్చిమ బెంగాల్: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్‌చండీ పహార్.
ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..