'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి | Vijay Sethupathi Comments About Viral Title Poster Of His Movie With Puri Jagannath | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: రాజకీయాల్లోకి వస్తారా?.. విజయ్ సేతుపతి సమాధానం ఇదే..!

May 22 2025 8:00 AM | Updated on May 22 2025 10:50 AM

Vijay Sethupathi Comments About Movie Title with Puri Jagannath

కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి మరో మూవీ రెడీ అయిపోయారు. విడుదల-2 తర్వాత ఆయన నటించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఏస్. ఈ మూవీ హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో విజయ్ సేతుపతి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో చేస్తున్న సినిమా టైటిల్‌పై ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి స్పందించారు. ఇంకా మేము టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆయన అన్నారు. ఏఐతో ఎవరో పోస్టర్‌ చేశారని.. అది మనది కాదని తెలిపారు. పూరి జగన్నాథ్‌ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందని విజయ్ సేతుపతి అన్నారు. ఆయన సినిమాలు కూడా చూశానని.. స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విశాల్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కలవడంపై మాట్లాడారు. ఆయనతో కేవలం పెళ్లి గురించి మాత్రమే చర్చించానని వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా విశాల్‌ను అడిగానని తెలిపారు. నేను మాత్రం రాజకీయాల్లోకి రానని విజయ్ సేతుపతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

విజయ్ సేతిపతి మాట్లాడుతూ.. 'మేము టైటిల్‌ ఖరారు చేయలేదు. బెగ్గర్‌ అని టైటిల్ మీరే ఫిక్స్ చేశారా?  పూరి జగన్నాథ్‌ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన సినిమాలు చాలా చూశా.  స్క్రిప్టు వినడానికి రెండు, మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. కానీ కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. జూన్‌లో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఆడియన్స్‌ కంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement